
మొక్కలే ప్రాణాధారమని, పర్యావరణ పరిరక్షణ వాటితోనే సాధ్యమని.. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు విశ్రాంత ఉద్యోగి. ఇప్పటివరకు 3,800 మొక్కలు నాటి, వాటి సంరక్షణలో తరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన గట్టు కృష్ణమూర్తి.. చొప్పదండి నవోదయ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి 2021లో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటినుంచి పట్టణంలోని ఆలయాలు, చెరువు గట్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా ఖాళీస్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించడమే కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఉదయాన్నే లేచి పార, తట్ట పట్టుకుని బయలుదేరుతారు. పురపాలిక నర్సరీ నుంచి మొక్కలను, సొంత ఖర్చుతో ట్రీగార్డులను సమకూర్చుకుంటున్నారు. ‘భావితరాలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో మొక్కలు నాటుతున్నా’ అని కృష్ణమూర్తి తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. మొక్కలే ప్రాణాధారమని, పర్యావరణ పరిరక్షణ వాటితోనే సాధ్యమని.. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు విశ్రాంత ఉద్యోగి. ఇప్పటివరకు 3,800 మొక్కలు నాటి, వాటి సంరక్షణలో...