
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర హింసలో బాధిత సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై స్థానికులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఇది బీజేపీ పన్నిన పక్కా ప్రణాళిక అని టీఎంసీ ఆరోపించింది. టీఎంసీ పాలనపై ప్రజాగ్రహమే కారణమని బీజేపీ అంటోంది.అసలేం జరిగింది?సోనార్‌పూర్‌లోని కమ్రాబాద్ ప్రాంతానికి అభిషేక్ బెనర్జీ మోటార్ సైకిల్‌పై వస్తున్న సమాచారం అందుకున్న వందలాది మంది స్థానికులు గుంపుగా చేరారు. ఆయన రాగానే చుట్టుముట్టి 'చోర్ చోర్' (దొంగ) అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు సైతం చీపుర్లు, వెదురు కర్రలతో నిరసనకు దిగారు. కొంతమంది ఆందోళనకారులు అభిషేక్‌పై రాళ్లు, గుడ్లు, చెప్పులు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తోపులాటలో ఆయన చొక్కా చిరిగిపోగా, కళ్లద్దాలు దెబ్బతిన్నాయి. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనకు హెల్మెట్ ఇచ్చి.. మానవహారంగా ఏర్పడి అతికష్టం మీద అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాడిలో గాయపడిన అభిషేక్‌ను కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ థెరపీ యూనిట్ (ఐటీయూ)లో చేర్పించి చికిత్స అందించారు.బీజేపీ కుట్రే: అభిషేక్, మమతదాడి అనంతరం అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. "ఇది బీజేపీ స్పాన్సర్ చేసిన హత్యాయత్నం. నన్ను చంపడానికే ఈ దాడి చేశారు. హెల్మెట్ ఉండటం వల్లే నా ప్రాణాలు నిలిచాయి. మా పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా భద్రత పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర హింసలో బాధిత...