Padmanabhaswamy Temple Probe : అపార దైవ సంపదకు నిలయమైన కేరళలోని ప్రముఖ శ్రీ పద్మనాభస్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయానికి చెందిన అత్యంత విలువైన వస్తువులు అదృశ్యం అయ్యాయనే వార్తలు రాగా.. అక్కడ నెలకొన్న భద్రతా లోపాల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని కేరళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఆలయంలో వస్తువుల అదృశ్యం, భద్రతా వైఫల్యాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కె.మురళీధరన్ శనివారం అధికారికంగా వెల్లడించారు.హోం శాఖ చర్చల తర్వాత తుది ప్రకటన..ఈ వివాదంపై దేవాదాయశాఖ మంత్రి మురళీధరన్ స్పందిస్తూ.. ఆలయ పరిపాలన కమిటీ నుంచి తాము కోరిన నివేదిక ప్రభుత్వానికి అందిందని స్పష్టం చేశారు. ఆలయ ఆస్తుల రక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని, ఇందులో ఎవరి జోక్యాన్ని లేదా నిర్లక్ష్యాన్ని అనుమతించబోమని హెచ్చరించారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖతో త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అనంతరం విచారణా కమిటీకి సంబంధించిన అధికారిక వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే ప్రసిద్ధ శబరిమల ఆలయంలో బంగారం అవకతవకలపై స్పందించిన మంత్రి.. అక్కడ ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న విచారణ తీరు తమ ప్రభుత్వానికి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే స్వయానా హైకోర్టు ఈ సిట్‌ను నియమించినందున.. దానిని మార్చే, రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.పోలీసుల నివేదికపై ఆలయ కమిటీ, రాజకుటుంబం ఆగ్రహంమరోవైపు పద్మనాభస్వామి ఆలయం నుంచి వస్తువులు మాయం అయ్యాయంటూ వస్తున్న పోలీసుల ఆరోపణలను ఆలయ పరిపాలన కమిటీ, ట్రావెన్కోర్ రాజకుటుంబం తీవ్రంగా ఖండించాయి. ఆలయంలోని వజ్రాల నగలతో సహా అన్ని Padmanabhaswamy Temple Probe : అపార దైవ సంపదకు నిలయమైన కేరళలోని ప్రముఖ శ్రీ పద్మనాభస్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయానికి చెందిన అత్యంత విలువైన వస్తువులు అదృశ్యం అయ్యాయనే వార్తలు రాగా.. అక్కడ నెలకొన్న భద్రతా లోపాల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని కేరళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఆలయంలో వస్తువుల అదృశ్యం, భద్రతా వైఫల్యాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కె.మురళీధరన్ శనివారం అధికారికంగా వెల్లడించారు.హోం శాఖ చర్చల తర్వాత తుది ప్రకటన..ఈ వివాదంపై దేవాదాయశాఖ మంత్రి మురళీధరన్ స్పందిస్తూ.. ఆలయ పరిపాలన కమిటీ నుంచి తాము కోరిన నివేదిక ప్రభుత్వానికి అందిందని స్పష్టం చేశారు. ఆలయ ఆస్తుల రక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని, ఇందులో ఎవరి జోక్యాన్ని లేదా నిర్లక్ష్యాన్ని అనుమతించబోమని హెచ్చరించారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖతో త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అనంతరం విచారణా కమిటీకి సంబంధించిన అధికారిక వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే ప్రసిద్ధ శబరిమల ఆలయంలో బంగారం అవకతవకలపై స్పందించిన మంత్రి.. అక్కడ ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న విచారణ తీరు తమ ప్రభుత్వానికి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే స్వయానా హైకోర్టు ఈ సిట్‌ను నియమించినందున.. దానిని మార్చే, రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.పోలీసుల నివేదికపై ఆలయ కమిటీ, రాజకుటుంబం ఆగ్రహంమరోవైపు పద్మనాభస్వామి ఆలయం నుంచి వస్తువులు మాయం అయ్యాయంటూ వస్తున్న పోలీసుల ఆరోపణలను ఆలయ పరిపాలన కమిటీ, ట్రావెన్కోర్ రాజకుటుంబం తీవ్రంగా ఖండించాయి. ఆలయంలోని వజ్రాల నగలతో సహా అన్ని రకాల విలువైన ఆభరణాలు, నిధులు నిక్షేపంగా సురక్షితంగా ఉన్నాయని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఆలయంలో క్రమం తప్పకుండా ఆడిటింగ్ ప్రక్రియ జరుగుతోందని, అందువల్ల వస్తువులు అదృశ్యం అయ్యే అవకాశమే లేదని కొట్టిపారేసింది. ట్రావెన్కోర్ రాజకుటుంబ సభ్యుడు ఆదిత్య వర్మ సైతం పోలీసుల నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నివేదిక ఏకపక్షంగా ఉందని, దానికి ఎలాంటి విశ్వసనీయత లేదని ఆయన తెలిపారు. తాము స్వయంగా ఆలయంలో వ్యక్తిగత తనిఖీలు నిర్వహించామని, పోయాయని ప్రచారంలో ఉన్న వస్తువులన్నీ గర్భగుడి వద్దే అత్యంత భద్రంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.ఆస్తుల డిజిటలైజేషన్‌కు శ్రీకారం..ఈ వివాదాల నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఉన్న ఖరీదైన వస్తువులు, స్థిరాస్తులు, ఇతర ఆర్థిక లావాదేవీల విలువను ఖరారు చేసి, ఆ పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తామని బోర్డు అధ్యక్షుడు కె.జయకుమార్ శనివారం ప్రకటించారు. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా ఆలయ ఆస్తులపై పూర్తి పారదర్శకత వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Padmanabhaswamy Temple Probe : అపార దైవ సంపదకు నిలయమైన కేరళలోని ప్రముఖ శ్రీ పద్మనాభస్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయానికి చెందిన అత్యంత విలువైన