
శివనామ స్మరణతో పునీతమవ్వాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం "సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర" పేరుతో ఒక అద్భుతమైన డివైన్ టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. కేవలం ఒకే ఒక్క టూర్లో ఏకంగా ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సువర్ణావకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక యాత్ర కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' (Bharat Gaurav Tourist Train) సర్వీసును ఉపయోగించనున్నారు. జూన్ 16న తెలంగాణలోనిన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ తన జర్నీని స్టార్ట్ చేయనుంది. ఈ డివైన్ టూర్ ప్యాకేజీ మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ రైలును డిజైన్ చేశారు. కేవలం సికింద్రాబాద్‌లోనే కాకుండా, ప్రయాణికుల డిమాండ్ మేరకు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్లలో కూడా ఈ రైలు ఎక్కే సదుపాయాన్ని కల్పించారు. దీంతో ఉత్తర తెలంగాణ భక్తులకు ఈ యాత్ర చాలా ఈజీగా మారనుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి మూడు కీలక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలు, పురాతన ఆలయాలను ఈ టూర్లో కవర్ చేయనున్నారు. భక్తులు ఎంతో కాలంగా కలలుగనే ప్రముఖ శివాలయాలన్నీ ఈ సింగిల్ టూర్లో దర్శించుకోవచ్చు. ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం సందర్శించే ప్రధాన క్షేత్రాల లిస్ట్ గమనిస్తే.. యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అయి నేరుగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నాక, ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత రైలు గుజరాత్ వైపు యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అయి నేరుగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నాక, ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత రైలు గుజరాత్ వైపు పరుగులు తీస్తుంది. అక్కడ ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాల డివైన్ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృశ్నేశ్వర్ క్షేత్రాలను సందర్శిస్తారు. ఈ ఏడు క్షేత్రాల దర్శనం పూర్తయ్యాక తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. సాధారణ భక్తుడి నుంచి లగ్జరీగా ప్రయాణించాలనుకునే వారి వరకు అందరికీ అందుబాటులో ఉండేలా ఐఆర్సీటీసీ మూడు కేటగిరీల్లో ధరలను నిర్ణయించింది. • ఎకానమీ క్లాస్ (Sleeper): పెద్దలకు రూ. 17,600 కాగా, 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు రూ. 16,300 గా ఫిక్స్ చేశారు. • స్టాండర్డ్ క్లాస్ (3AC): పెద్దలకు రూ. 26700, పిల్లలకు రూ. 25,200 ఉంటుంది. • కంఫర్ట్ క్లాస్ (2AC): పెద్దలకు రూ. 34,600 కాగా, పిల్లలకు రూ. 32,800 గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ ధరలోనే భక్తులకు ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి ప్యూర్ వెజిటేరియన్ భోజనం అందిస్తారు. దీంతో పాటు హోటల్ వసతి, లోకల్ సైట్ సీయింగ్ కోసం బస్సు సౌకర్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్/టూర్ మేనేజర్ల సేవలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే ఆలయాల్లో ఉండే అదనపు దర్శన టికెట్లు, పర్సనల్ ఖర్చులు మాత్రం భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఏడు జ్యోతిర్లింగాలను చుట్టి రావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. శివనామ స్మరణతో పునీతమవ్వాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ...