
టాలీవుడ్ లో సడెన్ గా ట్రెండ్ మారింది. హీరోలంతా గ్యాంగ్ స్టర్ కథలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది హీరోలు గ్యాంగ్ స్టర్ కథలతో చిత్రాలు ప్రారంభించారు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ల నుంచి తారక్, నాని లాంటి నేటి తరం హీరోల వరకు అందరూ గ్యాంగ్ స్టర్ సినిమాలే చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీరసింహా రెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మరోసారి నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కుతోంది. బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో రెండవ చిత్రం పార్రంభం అయింది. ఈ మూవీ మాఫియా నేపథ్యంలో ఉండబోతోందట. చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. అయినప్పటికీ కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. సిన్సియర్ పోలీస్ అధికారి మాఫియా డాన్ గా మారితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు నమోదవుతాయి. ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ సెటప్ తో ఉంటాయి. కథా నేపథ్యంలో కొత్తగా ఉంటుంది. అయినప్పటికీ హీరో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారు. డ్రాగన్ మూవీలో తారక్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని ఇటీవల మాస్ చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుజీత్ దర్శకత్వంలో నాని బ్లడీ రోమియో అనే చిత్రంలో నటించనున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ కథాంశం. ఇలా హీరోలంతా వరుసపెట్టి మాఫియా, గ్యాంగ్ స్టర్ నేచురల్ స్టార్ నాని ఇటీవల మాస్ చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుజీత్ దర్శకత్వంలో నాని బ్లడీ రోమియో అనే చిత్రంలో నటించనున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ కథాంశం. ఇలా హీరోలంతా వరుసపెట్టి మాఫియా, గ్యాంగ్ స్టర్ కథలు చేస్తే అభిమానులకు చిరాకు వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఏ చిత్రానికి అదే ప్రత్యేకం కాబట్టి మెప్పించే అవకాశం కూడా ఉంది. టాలీవుడ్ లో సడెన్ గా ట్రెండ్ మారింది. హీరోలంతా గ్యాంగ్ స్టర్ కథలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది హీరోలు గ్యాంగ్ స్టర్ కథలతో చిత్రాలు ప్రారంభించారు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి...