
ఐపీఎల్లో ఆర్సీబీ అనగానే అందరికీ విరాట్ కోహ్లి గుర్తుకొస్తాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతూ ఆ ఫ్రాంఛైజీకి కోహ్లి తీసుకొచ్చిన ఆకర్షణ, విలువే వేరు. ఇప్పటికీ కింగ్ నిలకడను కొనసాగిస్తున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కానీ కెప్టెన్‌గా ఆర్సీబీ రాత మార్చి, బ్యాటర్‌గా ఆ జట్టును ఎంతో ప్రమాదకరంగా తీర్చిదిద్దుతున్న ఘనత మాత్రం రజత్ పాటీదార్‌కే చెందుతుంది. అతడికి స్టార్ ఇమేజ్ లేదు. తన గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగదు. మైదానంలో, బయట అతను కూడా పెద్దగా హడావుడి చేయడు. కానీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ప్రశాంతంగా పని చేసుకుపోతూ ఆర్సీబీని మేటి జట్టుగా నిలబెడుతున్నాడు పాటీదార్. ఈ ఏడాది ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు అనగానే.. ఇది సమవుజ్జీల పోరు అని, ఎంతో హోరాహోరీగా సాగుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఆర్సీబీ దూకుడు ముందు జీటీ ఏమాత్రం నిలవలేకపోయింది. ఒక ఇన్నింగ్స్ అయ్యేసరికే మ్యాచ్ ఫలితంపై ఒక అంచనా వచ్చేసింది. ఆర్సీబీ ఆల్‌రౌండ్ మెరుపుల ధాటికి బెంబేలెత్తిన టైటాన్స్.. ఏకంగా 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు పాటీదార్. అతడి ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు ఉండటం విశేషం. తర్వాత తన బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలతోనూ అతను తన ప్రత్యేకతను చాటాడు. గుజరాత్ లాంటి బలమైన బ్యాటింగ్ ఉన్న జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్లో కీలకమైన ప్లేఆఫ్స్‌లో చెలరేగిపోవడం పాటీదార్‌కు ఇది కొత్తేమీ కాదు. ఐపీఎల్ కెరీర్ ఆరంభ దశలోనే అతను 2022 ఐపీఎల్లో కీలకమైన ప్లేఆఫ్స్‌లో చెలరేగిపోవడం పాటీదార్‌కు ఇది కొత్తేమీ కాదు. ఐపీఎల్ కెరీర్ ఆరంభ దశలోనే అతను 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూపై 54 బంతుల్లో 112 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ప్లేఆఫ్స్‌లో శతకం సాధించిన తొలి అన్క్యాప్డ్ ఆటగాడిగా అప్పుడతను రికార్డు సృష్టించాడు. 6 ఇన్నింగ్స్‌లు.. 338 పరుగులు.. 112.66 సగటు.. 193.14 స్ట్రైక్ రేట్.. ఇదీ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో రజత్ రికార్డు. ఈ కీలక దశలో అతడి కంటే మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాడు ఇంకొకరు కనిపించరు. ఈ ఐపీఎల్లో 14 మ్యాచ్‌లాడి 44.18 సగటతుతో 486 పరుగులు చేశాడు. అందులో ఐదు అర్ధశతకాలున్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 196.76 కావడం విశేషం. మొత్తంగా ఐపీఎల్లో 56 మ్యాచ్‌లాడిన ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు.. 33.98 సగటుతో 1597 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 14 అర్ధశతకాలు ఉన్నాయి. కెరీర్ స్ట్రైక్ రేట్ 165.15. ఆర్సీబీకి కోహ్లి రూపంలో నిలకడైన ఓపెనర్ ఉన్నాడు. జట్టు రెగ్యులర్ ఓపెనింగ్ ఫిల్ సాల్ట్, మూడో స్థానంలో ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్ కూడా నిలకడగా ఆడే బ్యాటర్లే. దీంతో నాలుగో స్థానంలో రజత్ పాటీదార్ వచ్చేటప్పటికి ఎక్కువ సందర్భాల్లో పవర్ ప్లే అయిపోతుంటుంది. ఫీల్డింగ్ ఏర్పాట్లు మారిపోతాయి. పవర్ ప్లే అయ్యాక, నాలుగో నంబర్ బ్యాటర్ వచ్చే సమయానికి స్కోరు వేగం తగ్గడం సహజం. ఆ స్థానంలో ఆడే బ్యాటర్లు కొంచెం ఆచితూచి ఆడతారు. అందులోనూ కెప్టెన్ అంటే బాధ్యతాయుతంగా ఆడాలి కాబట్టి మరికొంత జాగ్రత్త పడతారు. కానీ రజత్ మాత్రం ఇందుకు భిన్నం. అతను ఎదుర్కొనే తొలి బంతి అయినా.. స్లాట్‌లో పడిందంటే స్టాండ్స్‌లో తేలాల్సిందే. కొన్ని బంతులు ఆచితూచి ఆడడం, తర్వాత షాట్లకు దిగడం అతడి శైలి కాదు. ఆరంభం నుంచే పిడుగుల్లాంటి షాట్లతో చెలరేగిపోతుంటాడు. బౌలర్ల గణాంకాలను సవరించి, స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తుంటాడు. అందుకే మిడిల్ ఓవర్లను పవర్‌ప్లేగా మారుస్తున్న బ్యాటర్‌గా అతడిని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఫీల్డింగ్ నిబంధనలతో అతడికి సంబంధమే ఉండదని, ఎలాంటి స్థితిలోనైనా భారీ షాట్లు, ఏ బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగలడని కొనియాడుతున్నారు. నిజానికి ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో పాటీదార్ ఇంత దూకుడుగా ఏమీ ఆడేవాడు కాదు. ఓ మోస్తరు వేగంతోనే బ్యాటింగ్ చేసేవాడు. టెక్నిక్ ప్రధానంగా అతడి ఆట ఉండేది. కానీ అలా ఆడితే ఐపీఎల్లో డిమాండ్ ఉండదు. జట్ల ప్రయోజనాలు నెరవేరవు. సురేశ్ రైనా, అభిషేక్ శర్మ లాంటి బ్యాటర్లు గతంలో ఐపీఎల్ అవసరాలకు తగ్గట్లుగా బ్యాటర్లు శైలి మార్చుకుని విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడినట్లే.. రజత్ సైతం స్టైల్ మార్చుకున్నాడు. ఇప్పుడు లీగ్‌లో అత్యంత ప్రమాదకర ఆటగాళ్లలో అతనొకనడంలో సందేహం లేదు. గత సీజన్లో ఆర్సీబీ పగ్గాలందుకున్న తొలి సీజన్లోనే జట్టు రాత మార్చేశాడు పాటీదార్. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరుకు కప్పు అందించిన అతను.. ఈ సీజన్లోనూ జట్టును గొప్పగా నడిపించాడు. లీగ్ దశలో అగ్రస్థానంతో ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో గుజరాత్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇదే ఊపులో రెండో కప్పును కూడా సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. అదే