
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Tirumala Rush Alert Today: తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు దర్శనం కోసం దాదాపు 18 గంటల సమయం పడుతోంది. వీకెండ్ ప్రభావంతో రద్దీ పెరగడమే కాకుండా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకు ప్రముఖుల రాక కూడా పెరిగింది. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ చైర్మన్ జగతి శివప్ప, సినీ నటుడు రాజ్ కుమార్, తమిళనాడు బీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమలవాన్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగానే టీటీడీ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుని, రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీస్సులు పొందారు. వారు స్వామివారి పట్టువస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలను కూడా స్వీకరించారు. ఈరోజు గరుడసేవ.. తిరుమలలో ప్రతి నెలా జరిగే గరుడసేవ ఈరోజు నిర్వహించబడుతుంది. ఈ నెల 31వ తేదీ పౌర్ణమి సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల మధ్య, సర్వాలంకార భూషితడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణ కాంతుల గరుడిపై విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. భక్తులు వివిధ రూపాల్లో, అంటే బంగారం, వెండి, నగదు రూపంలో స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన నయాతీ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ అగ్ర ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, టీటీడీకి రూ. 1.13 కోట్ల తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. భక్తులు వివిధ రూపాల్లో, అంటే బంగారం, వెండి, నగదు రూపంలో స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన నయాతీ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ అగ్ర ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, టీటీడీకి రూ. 1.13 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయం ముందు ఈ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, టీటీడీ చైర్మన్ పత్రాలు, తాళాలను అందజేశారు. తిరుమల రద్దీ.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. కేవలం ఒక్క రోజులోనే 92 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 52 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించగా, మొత్తం ఆదాయం రూ.3.76 కోట్లుగా నమోదైంది. లడ్డు విక్రయాలతో పాటు అన్నప్రసాదం కోసం 2.85 లక్షల మంది వచ్చారు. ఈ క్రమంలో 3,681 మందికి వైద్య సదుపాయాలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలా తోరణం లైన్ వరకు చేరుకున్నాయి. SSD టోకెన్లు లేని భక్తులకు దర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాడు స్వామివారు అశ్వవాహనంపై కల్కీ అవతారంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల గంభీరమైన నడక, భక్త బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల మధ్య గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook