
8th pay commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఈసారి జీతాల పెంపు లెక్కల్లో ద్రవ్యోల్బణంతో పాటు ఆహార అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటివరకు వేతన సంఘాలు ఒక వ్యక్తికి రోజుకు 2,700 క్యాలరీల ఆహారం సరిపోతుందనే అంచనాల ఆధారంగా కనీస వేతనాలను నిర్ణయించేవి. అయితే ప్రస్తుత కాలంలో జీవన విధానం, ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు, పనిభారం పెరగడంతో ఆ లెక్కలు సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వారి వాదన ప్రకారం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరియు పోషకాహార సంస్థల తాజా సూచనల ప్రకారం కొంతమంది ఉద్యోగులకు రోజుకు సుమారు 3,490 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. అందువల్ల కనీస వేతనాల లెక్కలను కూడా కొత్త ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం పాలు, పప్పులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పాత ప్రమాణాల ప్రకారం నిర్ణయించిన జీతాలతో కుటుంబ అవసరాలను తీర్చడం కష్టమవుతోందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఒక కొత్త లెక్కను ప్రతిపాదించాయి. ఐదుగురు సభ్యుల కుటుంబానికి అవసరమైన ఆహారం, ఇతర ప్రాథమిక ఖర్చులు, ప్రస్తుత కరువు భత్యం, విద్యా మరియు వైద్య వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే కనీస వేతనం రూ.55,000 నుంచి రూ.60,000 మధ్య ఉండాలని సూచిస్తున్నాయి. ఈ ప్రతిపాదన అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గణనీయమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ నిర్ణయంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఇది ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రమే. అయితే ప్రస్తుతం ఇది ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రమే. 8వ వేతన సంఘం తుది సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల తర్వాతే జీతాల పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 3,490 క్యాలరీల ఫార్ములా, పెరుగుతున్న ఆహార ధరలు, కనీస వేతనాల పెంపు అంశాలు ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 8వ వేతన సంఘం నివేదిక వెలువడే వరకు ఈ చర్చ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. 8th pay commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఈసారి జీతాల పెంపు లెక్కల్లో ద్రవ్యోల్బణంతో పాటు...