Mamata Banerjee Warning Audio Leak : పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి ఉదంతం సరికొత్త రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ దాడి అనంతరం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఓ వార్నింగ్ ఆడియో క్లిప్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అభిషేక్ బెనర్జీ కోల్‌కతాలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా.. ఆ దవాఖాన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)పైనే దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఫోన్ చేసి మరీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మరి ఆమె ఆయనపై ఎందుకు ఫైర్ అయ్యారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. బెల్ వ్యూ ఆసుపత్రి సీఈఓకు దీదీ గట్టి వార్నింగ్..సోనార్‌పూర్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ అభిషేక్ బెనర్జీని చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని ప్రసిద్ధ 'బెల్ వ్యూ' ఆసుపత్రికి తరలించారు. అయితే అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. ఆయన్ను తక్షణమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు ఒక సీనియర్ పోలీసు అధికారి కూడా ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని మమతా బెనర్జీ నేరుగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బెల్ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్ టాండన్‌తో మమత మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది.లీకైన ఆడియో రికార్డింగ్ ప్రకారం.. మమతా బెనర్జీ సదరు సీఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "టాండన్.. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. గతంలో మీకు మేము చేసిన సహాయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ అనాలోచిత చర్యకు దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని Mamata Banerjee Warning Audio Leak : పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి ఉదంతం సరికొత్త రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ దాడి అనంతరం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఓ వార్నింగ్ ఆడియో క్లిప్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అభిషేక్ బెనర్జీ కోల్‌కతాలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా.. ఆ దవాఖాన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)పైనే దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఫోన్ చేసి మరీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మరి ఆమె ఆయనపై ఎందుకు ఫైర్ అయ్యారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. బెల్ వ్యూ ఆసుపత్రి సీఈఓకు దీదీ గట్టి వార్నింగ్..సోనార్‌పూర్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ అభిషేక్ బెనర్జీని చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని ప్రసిద్ధ 'బెల్ వ్యూ' ఆసుపత్రికి తరలించారు. అయితే అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. ఆయన్ను తక్షణమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు ఒక సీనియర్ పోలీసు అధికారి కూడా ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని మమతా బెనర్జీ నేరుగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బెల్ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్ టాండన్‌తో మమత మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది.లీకైన ఆడియో రికార్డింగ్ ప్రకారం.. మమతా బెనర్జీ సదరు సీఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "టాండన్.. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. గతంలో మీకు మేము చేసిన సహాయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ అనాలోచిత చర్యకు దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని మేము గుర్తుపెట్టుకుంటాం. మీరు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రస్తుతానికి బెంగాల్లో బీజేపీ అధికారంలో ఉండవచ్చు. కానీ రేపు వారు అధికారం కోల్పోయిన తర్వాత మేము ఏం చేయాలో అది చేసి చూపిస్తాం" అంటూ ఆమె హెచ్చరించారు. తన మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ ప్రాణాలకు ఏమాత్రం హాని జరిగినా దానికి ఆసుపత్రి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె మండిపడ్డారు.ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స.. ఐదుగురి అరెస్ట్!ఈ ఆసుపత్రి వివాదం, ఒత్తిళ్ల నేపథ్యంలో అభిషేక్ బెనర్జీని అక్కడి నుంచి తరలించినట్లు దీదీ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు మమతా బెనర్జీ స్వయంగా వెల్లడించారు. మరోవైపు సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీపై జరిగిన ఈ ఘోర భౌతిక దాడిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసిన అధికార యంత్రాంగం.. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. Mamata Banerjee Warning Audio Leak : పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి ఉదంతం సరికొత్త రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ దాడి అనంతరం...