
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినమాలకు, ఆయన డైలాగ్స్, మాటలు అంటే యువతకు తెగ ఇష్టం. ఆయన సినిమాల్లో సత్యాలు, కుటుంబ బంధాలపై ఇప్పటివరకు ఎన్నో విషయాలను అందిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులకు చేరవేస్తుంటారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ జీవితం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కళలకు సమాజంలో మార్పు తీసుకువచ్చే శక్తి ఉండదని, అవి కేవలం సమాజంలోని లోపాలను లేదా జరుగుతున్న సంఘటనలను ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. ఈ మార్పుల దిశగా చట్టసభలు కృషి చేయాలన్నారు. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్.. ఋగ్వేదం మానవ శాస్త్రాన్ని (ఆంథ్రోపాలజీ) వివరిస్తుందని, ప్రకృతిని అర్థం చేసుకోవడం, భయాన్ని అధిగమించడం, నియంత్రించడం ద్వారా ఫ్యాన్లు, ఏసీలు, మైక్రోవేవ్‌లు వంటి ఆవిష్కరణలకు దారితీసిందని వివరించారు. యజుర్వేదం జీవనశైలిని మెరుగుపరచడం, యాంత్రికీకరణ (మెకనైజేషన్) గురించి తెలియజేస్తుందని, సామవేదం సంగీతం, కళలు, సాహిత్యం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందని అన్నారు. ఆకలి, దాహం ఉన్నప్పుడు సంగీతం కంటే మంచి నీళ్లే ముఖ్యమని, ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాతే కళలను ఆస్వాదించగలమని బాలమురళీకృష్ణ కీర్తనను ఉదాహరణగా చెప్పారు. ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? సినిమాను అందమైన అబద్ధం అని పిలవడం సరికాదని, అది సమాజంలో ఏం జరుగుతుందో చూపే ఒక “అందమైన అద్దం” అని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి సినీ దర్శకుడు, రచయిత, నటుడు, అలాగే మీడియాలో ఉన్న ప్రతి By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy. సినిమాను అందమైన అబద్ధం అని పిలవడం సరికాదని, అది సమాజంలో ఏం జరుగుతుందో చూపే ఒక “అందమైన అద్దం” అని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి సినీ దర్శకుడు, రచయిత, నటుడు, అలాగే మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు తప్ప, వాటిని మార్చే శక్తి వారికి ఉండదని స్పష్టం చేశారు. మార్పు రావడానికి మనుషులు, నాయకులు, చట్టసభలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో.. పి.వి. నరసింహారావు చెప్పిన “దేశానికి రాజైనా అమ్మకి కొడుకే” అనే మాటను ఉటంకిస్తూ, దాన్ని విస్తరించారు. ప్రపంచానికి చక్రవర్తి అయినా ఇంట్లో భర్తగా, పిల్లలకు తండ్రిగా, తోబుట్టువులకు అన్నగా/తమ్ముడిగా ఉంటాడని అన్నారు. బయటి ప్రపంచంలో యుద్ధాలు గెలవడం సులభం అని, ఎందుకంటే శత్రువు బయట ఉంటాడని, కానీ కుటుంబాన్ని గెలవడం చాలా కష్టమని, కుటుంబాన్ని గెలవకుండా ఎవరూ ప్రపంచంలో విజయం సాధించలేరని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. ఆయన మాటలు వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన బాధ్యతలు, సామాజిక దృక్పథంపై తన లోతైన ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినమాలకు, ఆయన డైలాగ్స్, మాటలు అంటే యువతకు తెగ ఇష్టం. ఆయన సినిమాల్లో సత్యాలు, కుటుంబ బంధాలపై ఇప్పటివరకు...