
Obsession Hollywood Movie Review: అబ్సెషన్.. ఈ చిత్రం హాలీవుడ్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా రూ.950 కోట్లకు పైగా వసూలు చేస్తూ సంచలనం సృష్టించింది. భారత్లో కూడా ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. బాలీవుడ్ చిత్రాలను పక్కన పెట్టి ఈ సినిమాపైనే ఆసక్తి చూపుతున్నారు. అబ్సెషన్ సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత భారత్లో విడుదలైంది.. కానీ తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. అబ్సెషన్ ఇంగ్లీష్ సినిమా క్రేజ్ విపరీతంగా పెరిగింది. భారత్లో కూడా కోట్లను వసూలు చేస్తూ, హైదరాబాద్లో కూడా పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారు ఖచ్చితంగా అబ్సెషన్ చూడాల్సిందే. ఈ సినిమాలో ప్రతి నటుడు తమ పాత్రను అద్భుతంగా పోషించారు. ఇది ఒక సూపర్ నేచురల్ హారర్ ఫిలిం. ఇందులో దయ్యాలు, భూతాలు నేరుగా కనిపించకపోయినా, చాలా భయపెడుతుంది. ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఇంటర్వెల్ కార్డు పడింది. ప్రధానంగా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిందే. సినిమా క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను కథలో లీనం చేసేలా డైరెక్టర్ చిత్రాన్ని తీశారు. కథ విషయానికి వస్తే.. ఒక స్టోర్లో హీరో తన చిన్ననాటి స్నేహితురాలితో కలిసి పనిచేస్తుంటాడు. ఆమెను ప్రేమించి, తన ప్రేమను గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఇందుకోసం ఒక స్టోర్కు వెళ్లి ఒక వస్తువును కొనుగోలు చేస్తాడు. ఆ వస్తువు చుట్టూనే సినిమా కథ సాగుతుంది. అది ఒక అతీంద్రియ వస్తువు.. దాంతో ఏది కోరుకున్నా జరుగుతుంది. హీరో బేర్ పాత్ర ఏం కోరుకుంటాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా కథాంశం. ఈ సినిమా రన్ టైమ్ సుమారు గంట ఈ సినిమా రన్ టైమ్ సుమారు గంట 50 నిమిషాలు ఉంటుంది. ఇది జూన్ 2న ఓటీటీలోకి కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి 26 ఏళ్ల యూట్యూబర్ రూపొందించిన ఈ చిన్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కర్రీ బార్కర్ దర్శకత్వం వహించగా, మైఖేల్ జాన్స్టన్, నవరేట్ ముఖ్య పాత్రలో నటించారు. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం రూ.950 కోట్లు వసూలు చేయడం ద్వారా వంద రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించిందని చెప్పవచ్చు. ఈ సినిమను కేవలం రూ.7 కోట్లతోనే తీశారు. హాలీవుడ్, బాలీవుడ్ పెద్ద చిత్రాల తరహాలోనే ఇది కూడా వసూళ్లు సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ గురించి చర్చ జరుగుతోంది. IMDbలో కూడా ఇది 8.2 రేటింగ్ సాధించింది. అయితే, థియేటర్లలో కొన్ని సన్నివేశాలు కట్ చేయడంతో భారతీయ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఓటీటీలో మాత్రం అన్కట్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. మొదట పీకాక్ ప్లాట్ఫామ్లో విడుదలైన తర్వాత నెట్ఫ్లిక్స్లో రానుంది. మొత్తానికి నిక్కీ అనే స్నేహితురాలిని ప్రేమలో పడేయాలనే బేర్ అనే హీరో ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక పిల్లి మరణం తర్వాత అతనికి కొన్ని మాయా వస్తువులు లభిస్తాయి.. చివరికి ఆ కోరికే బేర్ జీవితానికి భయంకరమైన మలుపుగా మారుతుంది. Obsession Hollywood Movie Review: అబ్సెషన్.. ఈ చిత్రం హాలీవుడ్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా రూ.950 కోట్లకు పైగా వసూలు చేస్తూ...