
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. king cobra drinking water during his rescue video: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగ ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి జనాలు విల విల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు టెంపరెచర్ నమోదౌతుంది. ఈ క్రమంలో అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మనుషులు వడ దెబ్బలకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక నోరులేనీ జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పనిలేదు. ప్రతిరోజు మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయిరోడ్డు మీద పడిపోతున్నాయి. ఇక పాములు అడవులు, గుట్టలలో ఎక్కువగా సంచారం చేస్తాయి. పెరిగి పోయిన ఎండలకు అవి కాస్త జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పాములు బైక్ లలో, బెడ్ రూమ్ లలో, చెట్ల పొదల్లో, కార్లలో, బూట్లలో , చీకటిగా ఉండే ప్రదేశంలో ఎక్కువగా దాక్కుని ఉంటున్నాయి. ఈ క్రమంలో కోబ్రాలు ఎక్కువగా కూడా ఎండ వేడికి గురౌతున్నాయి. తాజాగా.. ఒక కింగ్ కోబ్రా స్కూల్ ఆవరణలో వచ్చింది. మరీ పాపం అది ఎండ దెబ్బకు గురైనట్లు ఉంది.ఎటు కదల్లేక వరాండా మీదనే మూర్ఛపోయింది. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ వెంటనే బాటిల్ తో పాము మీద నీళ్లను పోశాడు. కింగ్ కోబ్రాపై నెమ్మదిగా బాటిల్ తో ధారగా నీళ్లు పోసేసరికి అది కూడా A post shared by Suraj More (@animals_rescuer51) మరీ పాపం అది ఎండ దెబ్బకు గురైనట్లు ఉంది.ఎటు కదల్లేక వరాండా మీదనే మూర్ఛపోయింది. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ వెంటనే బాటిల్ తో పాము మీద నీళ్లను పోశాడు. కింగ్ కోబ్రాపై నెమ్మదిగా బాటిల్ తో ధారగా నీళ్లు పోసేసరికి అది కూడా ఏం చక్కా నీళ్లను తాగి ఎండ దెబ్బ నుంచి ఉపశమనం పొందింది. Read more: Cobra Video: బాప్ రే.. కట్టేసిన శునకం ముందు పడగ విప్పిన నాగు పాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో.. స్నేక్ క్యాచర్ సైతం కింగ్ కోబ్రా ఒళ్లంతా తడిసేలా దాని మీద బాటిల్ తో నీళ్లను పోశాడు. అది కూడా నీళ్లను తాగుతూ కూల్ అయిపోయింది. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొంత మంది పాపం.. కింగ్ కోబ్రాకు ఎండదెబ్బ తప్పలేదని కామెంట్స్ చేస్తున్నారు. పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్...