
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sukanya Samriddhi Yojana : మీ కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం కొంత పెట్టుబడి పెట్టాలనుకుంటే.. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కంటే ఉత్తమమైన సేవింగ్స్ స్కీమ్ మరోకటి లేదని చెప్పాలి. ఇతర సేవింగ్స్ సేవింగ్స్ స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ పథకం ఏడాదికి 8.2శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాదు ఈ స్కీములోని పెట్టుబడులు పాత ఆదాయపు పన్ను విధానంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కూతురు పేరు మీద రూ. 50 లక్షల భారీ నిధిని ఎలా కూడబెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన: సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం..ఆడపిల్లకు 10 సంవత్సరాలు నిండక ముందే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమె పేరు మీద అకౌంట్ తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు పెట్టుబడులను పెట్టవచ్చు. అయితే 21 సంవత్సరాల తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి సుకన్య సమృద్ధి యోజన కనీస వాటా రూ. 250 కాగా, గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఉంటుంది. 50 లక్షల రూపాయలు ఎలా డిపాజిట్ చేయాలి? ఒకవేళ తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజనలో 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 50,000 పెట్టుబడి పెడితే.. మొత్తం పెట్టుబడి రూ. 7.5 లక్షలు 50 లక్షల రూపాయలు ఎలా డిపాజిట్ చేయాలి? ఒకవేళ తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజనలో 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 50,000 పెట్టుబడి పెడితే.. మొత్తం పెట్టుబడి రూ. 7.5 లక్షలు అవుతుంది. ప్రస్తుత వార్షిక 8.2శాతం వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ. 23.94 లక్షలకు పైగా పెరగవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతారు. కానీ మెచ్యూరిటీ కాలం 21ఏళ్లు కాబట్టి.. మీరు పెట్టుబడి పెట్టకుండానే మరో 6ఏళ్ల పాటు చక్రవడ్డీని పొందుతూనే ఉంటారు. అదే సమయంలో, ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష పెట్టుబడితో, 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి = రూ. 15 లక్షలు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ ఫండ్ రూ. 47 లక్షలకు పైగా పెరుగుతుంది. మీరు ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 22.5 లక్షలు అవుతుంది. ప్రస్తుత 8.2శాతం వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం సుమారుగా రూ. 71 లక్షలకు పెరుగుతుంది. Also Read: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు తెచ్చే Top 4 Super Business IDEAS ఇవిగో! Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో...