‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌన రాగాలెన్నినాళ్లో..’ ‘అందంగా లేనా... అసలేం బాలేనా...’ దశాబ్దాలు గడిచినా ఆమె పాట ప్రతి నోట సజీవమే. బాణీకి శృతి కలిపినా రాగమే... వేరొకరి పాత్రకు గొంతు పలికినా రాగమే. పాటకు ప్రాణం పల్లవి అయితే... ఆ పల్లవులు ఆమె గాత్రంలో కోయిలను మరిపిస్తాయి. ముప్ఫై ఏళ్లుగా కొనసాగుతున్న గానప్రవాహం... మూడు వేలకు పైగా గీతాలు ఆలపించిన సుమధుర స్వరం... సునీత ఉపద్రష్ట. ప్రస్తుతం విభిన్న థీమ్‌తో ప్రేక్షకులను ప్రత్యక్షంగా అలరించేందుకు సన్నద్ధమవుతున్న సునీతను ‘నవ్య’ పలుకరించింది.

‘టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట... ప్రస్తుతం నేను తలపెట్టిన కాన్సర్ట్ ఇది. తరచూ వేదికలపై పాటలు పాడుతూనే ఉంటాను కానీ... ఇది వాటికి భిన్నమైనది. దీన్ని ఒక థీమ్ ఆధారిత కార్యక్రమంలా తీర్చిదిద్దాం. ఉదాహరణకు ‘మాయాబజార్’ థీమ్. ఆ తరం నుంచి ఈతరం వరకు... ఒక జ్ఞాపకాల దొంతరలాగా. ఇందులో నేను, సాహితి చాగంటి, శ్రీకృష్ణ, ధనుంజయ్ కలిసి గీతాలాపన చేస్తున్నాం. ఏ పాటలైతే ‘టైమ్‌లెస్’గా మనం భావించామో, అందరం కలిసి పాడుకొంటామో అలాంటి గీతాలు. నేను చిన్నప్పటి నుంచీ ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిక్స్ రెండుమూడు రోజులకు ఒకసారైనా చూస్తుంటాను. అలాగే నేను పని చేసినవాటిల్లో ‘గోదావరి’ నాకు చాలా ఇష్టం. నాకు మంచి పేరు తెచ్చిన చిత్రం. ఆ సినిమాకు సంబంధించి కూడా ఒక థీమ్ చేస్తున్నాం. జూన్ 13న హైదరాబాద్ శిల్పకళావేదిక లో ‘ఎలెవెన్ పాయింట్ టు, వేదమ్ ఆర్ట్స్’ నిర్వహిస్తున్న ఈ షోలో 150 ఏళ్ల వందేమాతరం థీమ్‌తో పాటు, ఎనిమిది మంది మ్యుజీషియన్స్ వారి వాయిద్యాల ప్రత్యేకతను ప్రదర్శించేలా రూపొందించాం.

<span

పాటల్లో లోతు తగ్గింది...

నేను పరిశ్రమలోకి వచ్చి ముప్ఫై ఏళ్లు దాటిపోయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మార్పులు చూశాను. బాలు గారు కానీ, జానకి గారు కానీ ఎప్పుడూ ఏం చెప్పేవారంటే... ‘మార్పు అనేది నిరంతరం’ అని. ఆ వాస్తవాన్ని అంగీకరిస్తూ ముందుకు వెళ్లాలి. కానీ మన గుర్తింపును, సహజత్వాన్ని, మూలాలను మరిచిపోకుండా ఉండాలి. అయితే ప్రధానంగా నేను గమనించిన మార్పు... ఇప్పుడు పాటల్లో లోతు చాలా తగ్గిపోయిందని అనిపిస్తోంది. అంటే ఒక పాటను మనం విశ్లేషించి, దాని గురించి మాట్లాడుకొనేంతగా సాహిత్యం లేదు. మనుషుల్లో సహజంగా వచ్చే మార్పువల్లనా, సమాజంలో వచ్చిన మార్పుల వల్లనా, లేక అసలు సినిమాల్లోనే మార్పు వచ్చిందా! ఒకప్పుడు సినిమాలో ఐదారు పాటలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అన్నీ అనడంలేదు. ‘సీతారామం, మహానటి, ఉప్పెన’ లాంటి చిత్రాల్లో నేనూ మంచి పాటలు పాడాను. మంచి సాహిత్యం వస్తూనే ఉంది. కానీ ఎక్కువ వయోలెన్స్ కావచ్చు, మరేదైనా కావచ్చు, తీవ్రత ఎక్కువున్న చిత్రాలు వస్తున్నాయి. ఆ హోరులో కొన్ని కొట్టుకుపోతున్నాయి. గతంలో చాలామంది పాటల కోసమే మళ్లీ మళ్లీ సినిమాకు వెళ్లేవారు.

జీర్ణించుకోవడం కష్టం...

నాకు ఇంకో భయం... రాబోయే రోజుల్లో సంగీతాన్ని ఏఐ ఆక్రమిస్తుందేమోనని!