
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్. కానీ, ఆ జట్టుకు ఆకర్షణ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా అతడే. ఇప్పుడు ఫైనల్లోనూ తమ ‘కింగ్’ విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు ఆ జట్టు అభిమానులు. నాయకుడిగా, బ్యాటర్‌గా తన జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్‌కు చేర్చడంలో శుభ్‌మన్ గిల్‌దే కీలక పాత్ర. కప్పును అందిస్తే ఆ లోటూ తీరిపోతుందనేది గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ ఆకాంక్ష. భారత క్రికెట్లో విరాట్ తర్వాత అంతటి ప్రాచుర్యం దక్కించుకున్న ‘ప్రిన్స్’ గిల్ ఫైనల్లోనూ విరుచుకుపడితే జీటీకి తిరుగుండదు. ఐపీఎల్ 2026 సీజన్ విజేతను తేల్చే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తుది పోరు జరగనుంది. ఇటు ‘ప్రిన్స్’ సొంత మైదానం కావడం.. అటు ‘కింగ్’ దూకుడు మీద ఉండటంతో ‘రెండో’ కప్పు ఎవరి సొంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరికీ ఇక్కడ అత్యుత్తమ గణాంకాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా నాకౌట్ మ్యాచుల్లో కోహ్లీ, గిల్ ఉత్తమ ఆటతీరు ప్రదర్శించారు. విరాట్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఆర్సీబీ, గుజరాత్ జట్ల మధ్యే తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో విరాట్ కోహ్లీ (43) దూకుడుగానే ఆడాడు. శుభ్‌మన్ గిల్ మాత్రం తేలిపోయాడు. కేవలం రెండే పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కానీ, రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌పై అతడు సెంచరీతో (104*) మెరిశాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ప్రస్తుతం అత్యధిక పరుగులు జాబితాలో గిల్ (722) రెండో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (600) ఆరో ప్లేస్‌లో ఉన్నాడు. గమనిక: ఈనాడు.నెట్లో గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్. కానీ, ఆ జట్టుకు ఆకర్షణ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా అతడే. ఇప్పుడు ఫైనల్లోనూ తమ ‘కింగ్’...