
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Thalliki Vandanam Scheme Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది అర్హులైన లబ్ధిదారులకు రూ.13,000 జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం డేటా వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. పాఠశాలల నుంచి సేకరించిన విద్యార్థుల ఆధార్, ఇతర వివరాలను ప్రభుత్వం ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాలకు పంపింది. అక్కడ ఈ వివరాలను హౌస్‌హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే నిధుల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయనుంది. సచివాలయాల్లో వెరిఫికేషన్ ఎలా? సచివాలయాల్లోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ పరిశీలన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 'నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్'లో ప్రత్యేక మాడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ వెరిఫికేషన్ వర్తిస్తుంది. డేటా పరిశీలనలో ఎదురవుతున్న 5 ప్రధాన సమస్యలను పరిష్కరిస్తూ అధికారులు తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. 1) లబ్ధిదారుల జాబితాలో తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో చేర్చుతారు. ఒకవేళ తల్లి లేనిపక్షంలో తండ్రి లేదా సంరక్షకుడి వివరాలను నమోదు చేస్తారు. 2) ఒకవేళ విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబ ఐడీలలో ఉంటే.. 'మైగ్రేషన్ ఆప్షన్' 2) ఒకవేళ విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబ ఐడీలలో ఉంటే.. 'మైగ్రేషన్ ఆప్షన్' ద్వారా వారిద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకువస్తారు. 3) ఒకే తల్లికి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు డేటాలో చూపిస్తే.. అధికారులు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేసి, సరైన రిమార్కులు నమోదు చేస్తారు. 4) విద్యార్థికి, తల్లికి పొరపాటున ఒకే ఐడీ నంబర్ నమోదై ఉంటే.. ఆ ఐడీని సరైన వ్యక్తికి ట్యాగ్ చేసి, రెండో వ్యక్తికి సంబంధించిన అసలైన ఐడీ వివరాలను సేకరించి అప్డేట్ చేస్తారు. 5) తప్పులు లేని లబ్ధిదారుల జాబితాను రూపొందించడం కోసం హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ను పక్కాగా పూర్తి చేస్తున్నారు. ఇక్కడ లబ్ధిదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సచివాలయ ఉద్యోగులు ఈ డేటా వెరిఫికేషన్‌ను సకాలంలో, ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రక్రియలో ఆలస్యమైతే లేదా తప్పులు దొర్లితే అర్హులైన విద్యార్థులకు 'తల్లికి వందనం' నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. సచివాలయాల్లో ఈ ఐదు రకాల సమస్యల పరిష్కారం పూర్తయిన తర్వాతే ప్రభుత్వం తుది అర్హుల జాబితాను విడుదల చేస్తుంది. ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అవుతుంది. Also Read: ఢిల్లీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిళ..కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు..రాహుల్ గాంధీతో భేటీ! Also Read: భారత్‌లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? గోల్డ్ రేట్ తగ్గిపోతుందా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి...