
Abhishek Sharma, Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై మాజీ భారత ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో విదేశీ పరిస్థితుల్లో బంతి స్వింగ్ అయితే ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇంటి పరిస్థితుల్లో చూపించే దూకుడును విదేశీ పిచ్‌లపైనా కొనసాగించేందుకు ఈ యువ బ్యాటర్లు ప్రత్యేకంగా పనిచేయాలని సూచించారు.




