
రాగ్మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘అనుమాన పక్షి’. ‘డీజే టిల్లు’ సినిమాతో పరిచయమైన విమల్కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్‌: రాగ్‌మయూర్‌, మెరిన్‌ ఫిలిప్‌ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అనుమాన పక్షి’. (Anumana Pakshi) ‘డీజే టిల్లు’ సినిమాతో పరిచయమైన విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజీవ్‌ చిలక, రాజేశ్‌ జగ్తియాని, హీరాచంద్‌ దండ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 18న (anumana pakshi release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయకచవితి సందర్భంగా ట్రైలర్‌ విడుదలైంది. ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తి వల్ల అతనితో పాటు, చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్న ఆసక్తికర అంశంతో ఈ మూవీని తీర్చిదిద్దారు. ప్రిన్స్, రాశి, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, అజయ్, మస్త్‌ అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వార్త చదివారా: వినాయక చవితి స్పెషల్‌.. కొత్త చిత్రాల పోస్టర్లు..



