
బిగ్ బాస్ తెలుగు పదో సీజన్లో ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. తొలి వారంలోనే ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు పంపిన బిగ్ బాస్.. ఇప్పుడు మరో ఎలిమినేషన్ ఉంటుందని అన్నారు. తాజాగా విడుదలైన ప్రోమోతో ప్రేక్షకులకు షాకిచ్చాడు బిగ్ బాస్. సాధారణంగా షో ప్రారంభమైన తొలి వారంలో ఎలిమినేషన్లు ఉండకపోవచ్చు లేదా ఉన్నా వీకెండ్లో మాత్రమే ఒకరిని బయటకు పంపిస్తుంటారు. కానీ ఈ సీజన్లో మాత్రం మొదటి వారంలోనే ఊహించని ట్విస్టులతో ఆటను ఎంతో ఉత్కంఠభరితంగా మార్చేశారు.




