
Bigg Boss Telugu 10 : దేబ్జానికి ఇంటి నుంచి పేరెంట్స్ రాసిన లెటర్ని ముకేశ్ నాశనం చేయడంతో దేబ్జానీ వాష్ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చిన సంగతి తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్లో ఆమె బయటకు వచ్చిన తరువాత లెటర్లో ఏముందో చెబుతానని నరేష్, రామ్‌ప్రసాద్ అంటారు. దేబ్జానీ తెలుగులో ఎలా మాట్లాడుతుందో అలా వాళ్ల పేరెంట్స్ రాసినట్లుగా చెబుతూ ఆమెను నవ్విస్తారు. ఆ తరువాత బిగ్‌బాస్.. ముకేశ్ కు తన తండ్రితో ఉన్న ఫోటోను పంపిస్తాడు. ఆ ఫోటో చూసి ముకేష్ ఆనందంతో పొంగిపోతాడు. అనంతరం బిగ్‌బాస్ కు థ్యాంక్స్ చెప్పాడు





