ఆపై ఫైళ్లు తీస్కుని వెళ్లబోతుండగా.. రాజు ఆగు ఆగు అంటూ ఆపుబోతాడు. అడ్డు జరగమని ఇందు అన్నా వినకుండా రెండు చేతులూ అడ్డంగా పెడతాడు. ఏంటి దబాయిస్తున్నావని అడగ్గా.. నిన్ను దబాయించడానికి నేనెరవరి అంటాడు. నిన్ను దబాయించడానికి నాకేం హక్కు ఉందని ఇందు అనగా.. ఏం లేదు అంటాడు. దీంతో ఇందు.. ఏం లేదు కదా, నీతో మాట్లాడడం నాకు అనవసరం అంటుంది. ఆపై వెళ్లిపోతుంది. రాజు మాత్రం ఇది హర్ట్ అయినట్లుంది, ఎలాగైనా కూల్ చేయాలనకుంటాడు. హాల్లోకి వెళ్లి చేయి పట్టుకుంటాడు. ఇందు చూడగానే సారీ చెబుతాడు. మీరెందుకు సారీ చెప్పడం, మిమ్మల్ని నా తప్పు అని ఇందు అనగా.. అలా అనకు ఇందు అంటాడు రాజు. నువ్వు నన్ను మోసం చేశావని ఇందు అంటే.. ఏయ్ నేను నిన్ను మోసం చేయడం ఏంటి అని రాజు అడుగుతాడు. ఈ మాట ఎవరైనా వింటే నా పరిస్థితి ఏంటని అనగా.. అవునవును తమరికి తమ ఫీలింగ్సే కావాలి కానీ, ఎదుటి వారి ఎమోషన్స్ గురించి అక్కర్లేదు కదా అంటుంది ఇందు. చెప్పేది కాస్త విను అంటే నేను విననంటుంది ఇందు. వింటే ఏమవుతుందంటూ సీరియస్ కాగా.. ఏంటి ఇందు నన్ను కొట్టాలనిపిస్తుందా అని అడుగుతాడు రాజు. అయితే లాగిపెట్టి ఇక్కడ కొట్టంటూ చెంప చూపిస్తాడు. లేదంటే నువ్వు అనుకున్నట్లు అది తీసుకొచ్చి నా నెత్తి పగులగొట్టు.. కానీ మాట్లాడకుండా ఉండు అని చెబుతాడు. దీంతో అసలు నువ్వేం మనిషివయ్యా.. నిన్ను ఎంతగా నమ్మాను, నా విషయాలు అన్నీ నీకు చెప్పాను, ఒక్క రహస్యం కూడా దాచిపెట్టలేదు అంటుంది. దీంతో నేనేం దాచానని అనగా.. అన్నీ దాచి పెట్టావంటూ ఇందు గొడవ పడుతుంది. ఇప్పటికీ నా వద్ద చాలా దాచావని, అబద్ధం చెబుతున్నావని అంటుంది. లక్కీ మా రేఖ ఆంటీ కొడుకని తెలిసినా నాకు చెప్పలేదు కదా దాన్ని దాచి పెట్టడమే కదా అంటారంటుంది. ఇదొక్కటే కదా అనగా.. మరి సిరి విషయం, దాన్ని దాచిపెట్టడం అనరా అంటుంద. ఇప్పుడు ఈ విషయం కడా దాచి పెట్టావు, అసలు నీ బతుక్కి ఒక్క నిజమైనా చెప్పావా అయ్యా అంటూ అలుగుతుంది. నువ్వు నన్నింకా పరాయి దానిలాగే చూస్తున్నావు కదా అనగా.. లేదు సొంత మనిషివనే అనుకుంటున్నానంటాడు. మరెందుకు ఇవన్నీ దాచావంటే.. చెబుదామనే అనుకున్నాను, కానీ అంటూ సిగ్గుపడిపోతాడు. అంటే లక్కీ విషయం ఇంట్లో అందరికంటే ముందు నీకే చెప్పానుగా అంటాడు. దీంతో ఇందు నేనడిగితేనే చెప్పావంటుంది. మరి సిరి విషయం చెప్పానుగా అంటాడు రాజు. ఆ నిజం నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా అంటే.. ఆ నిజం బయటపడిన తర్వాత చెప్పావు, అంతేకానీ అంతుకు ముందు చెప్పలేదు కదా అంటుంది. మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. రాజు దిక్కులు చూస్తే.. నాకర్థం అయిందంటుంది. నాకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నావు కదా అనగానే.. మీ అక్క నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పగానే.. నీ విషయం నేను అర్థం చేస్కున్నాను అంటాడు రాజు. ఈ విషయం నీకు రెండు, మూడు సార్లు చెప్పాలనే అనుకున్నాను, కానీ బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదంటాడు. అంతేకానీ నీ దగ్గర దాచాలని మాత్రం అనుకోలేదని, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలే క్షమించలేను కానీ.. ఆ విషయంలో ఐశ్వర్యను క్షమించానంటాడు రాజు. తను ఆరోజు నాతో ఆ పని చేయించకపోతే నువ్వు నాకు పరిచయం అయ్యేదానివి కాదు కదా అంటాడు. ఈ విషయంలో నేను ఐశుకు థాంక్స్ చెప్పుకోవాలని రాజు అనగా.. నేను కూడా ఐశుకు థాంక్స్ చెప్పుకోవాలి అని మనసులోనే అనుకుంటుంది ఇందు. తనలా చేయబట్టే నేను నిన్ను కలిశాను, నువ్వు నా బావవు అని తెలిసిందని అనుకుంటుంది. అప్పుడే ఇందును చూసిన రాజు నువ్వు నవ్వావని అంటాడు. ఇందు మాత్రం లేదని బుకాయిస్తుంది. ఇలా ఇద్దరూ చాలాసేపు ఆట పట్టించుకుంటారు. ఆపై కలిసి నవ్వుకుంటూ ఆఫీసుకు వెళ్తారు. ఇక చీకటి కాగా.. రాజు లక్ష్మికి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావని అడగ్గా.. ఇల్లు సర్దుకుంటున్నానని చెబుతుంది. సిరి ఏమైనా ప్రాబ్లమ్ చేస్తోందా అనగా.. అదెందుకు అడుగుతావులేరా అంటుంది లక్ష్మీ. ఏమైందమ్మా అనగా.. ఇల్లు పీకి పందిరి వేయడం తప్ప అన్నీ చేసేస్తుందిరా అంటుంది. చిన్న పిల్లలైనా నయం అనగా.. తను చిన్న పిల్లే కదమ్మా అంటాడు. అది నేను అర్థం చేస్కుంటాను కదరా, కానీ మీ నాన్న అర్థం చేస్కోవట్లేదని అంటుంది. ఇంట్లో కాకిగోల అయిపోయిందని అనగా.. ఆయనకు కొంచెం కూడా సహనం లేకపోతే ఎలా అమ్మా అంటాడు. ముందు నుంచే లేదు కదరా, అందుకే చిన్న చిన్న వాటికే గట్టిగా అరుస్తున్నాడని చెబుతుంది. పాపం ఈ పిల్లేమో.. తిననని మారం చేస్తుందని వివరిస్తుంది. అలా అయితే ఎలాగమ్మా, ఏదైనా తినాలి కదా అని రాజు అనగా.. ఆ పిల్ల అలగగానే వెంకీ జోకర్ గెటప్ వేసుకుని మరీ తనకు తినిపిస్తున్నాడని చెబుతుంది. ఆడిస్తూ మరీ తినిపిస్తున్నాడని వివరిస్తుంది. ఇదిగో మళ్లీ ఇందాక మారం చేస్తే.. మళ్లీ ఇప్పుడు తనిపిస్తున్నాడని అనగా.. ఒకసారి వెంకీకి ఫోన్ ఇవ్వమంటాడు రాజు. ఫోన్ ఇవ్వగానే.. థాంక్స్ చెబుతాడు. థాంక్స్ ఎందుకు అన్నయ్యా అనగానే.. నాకోసం సిరిని బాగా చూస్కుంటున్నావు, ఓపికగా కూడా ఉంటున్నావంటాడు. ఇందు వదిన నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతోందని, తనకోసమే నేను ఇదంతా చేస్తున్నాని చెబుతాడు వెంకీ. నేను ఇందు సంతోషానికి కారణం అవుతానే తెప్ప, బాధకి కారణం కానని రాజు మాటిస్తాడు. వెంకీ వన్స్ అగెన్ థాంక్స్‌రా అనగా.. ఓకే అంటాడు వెంకీ. ఆపై వెంటనే నేను సిరికి అన్నం తినిపిస్తున్నానని, కాసేపయ్యాక కాల్ చేస్తాననగా.. ఫోన్ పెట్టేస్తాడు రాజు. మరోవైపు మదన్, స్వాతిలు ఉన్న హోటల్‌కు పోలీసులు వెళ్లి సోదాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వాళ్లు ఉన్న గది తలుపులు కొట్టగా.. ఎదురుగా పోలీసులు ఉంటారు. ఏంటి సార్ అనగా.. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని అంటాడు. అరెస్ట్ ఏంటని మదన్ అనగా.. ఈ హోటల్లో అసాంఘీక కార్యక్రమాలు జరుగుతన్నాయని వచ్చామంటాడు. వెళ్లి ఆ అమ్మాయిని తీస్కురమ్మని లేడీ కానిస్టేబుల్‌ను పంపిస్తాడు. మీరు అనుకుంటున్నట్లుగా అలాంటి వాళ్లం కాదు సార్ అనగా. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది, మీరెంలాంటి వాళ్లోనని పోలీస్ అంటాడు. ఈ హోటల్లో ఉండే వాళ్లంతా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వాళ్లేనని చెబుతాడు. దీంతో స్వాతి షాక్ అవుతుంది. ఏ ఒక్కరినీ వదిలిపెట్టే సమస్యే లేదని చెబుతాడు. మేము మీరనుకుంటున్న వాళ్లం కాదు, మాది పద్ధతి గల కుటుంబమని, మేమిద్దరం బావా మరదళ్లమేనని స్వాతి చెబుతుంది. ఇక్కడ దొరికిన వాళ్లంతా ఇదే చెప్తారని పోలీసు అనగా.. లేదు సార్ మమ్మల్ని నమ్మండని చెబుతుంది స్వాతి. మేము ఇంట్లో నుంచి వచ్చేశాం, ఇల్లు రెంట్‌కి దొరికేవరకు ఇక్కడే స్టే చేస్తున్నాం అంతే సార్ అని వివరిస్తుంది. కానీ పోలీసులు మాత్రం.. ఇదంతా మాకు అనవసరం, మేము రైడ్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అంటాడు. ప్లీజ్ ప్లీజ్ అంటూ మదన్ బతిమాలుతున్నా వినకుండా.. వారిద్దరినీ పోలీసులు గద్దిస్తారు. మీరేం చెప్పాలనుకున్నా పోలీస్ స్టేషన్‌కు వచ్చాకే చెప్పాలని అంటారు. అలా బయటకు తీసుకురాగానే మీడియా వాళ్లను టీవీల్లో చూపిస్తుంది. అయితే శేషు హాల్లో కూర్చుని వార్తలు పెట్టగా.. మదన్, స్వాతిలు బ్రోతల్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుసుకుంటాడు. వారిని టీవీలో చూసి గట్టిగా కేకలు వేస్తాడు. అందరినీ పిలవగా.. అంతా వారిని చూసి షాక్ అవుతారు. ముఖ్యంగా భ్రమరం.. అయ్యో అయ్యో అయ్యో.. అంతా అయిపోయిందంటూ ఏడుస్తుంది. నా కూతురి జీవితం సర్వనాశనం అయిపోయిందంటుంది. వద్దు, వద్దు అన్నా వినకుండా బయటకెళ్లి.. ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కున్నారో చూడండంటూ కన్నీళ్లు పెడుతుంది. అన్యం పుణ్యం ఎరుగని నా కూతురిని రోడ్డుపాలు చేశావేంటి దేవుడా అంటూ ఏడ్వగా.. శేషు సైతం తన గుండె పట్టేసినట్లు అయిందని చెబుతాడు. ముందు మీరు ఊర్కోండి.. ఏమైందో మనమెళ్లి కనుక్కుందామని అపర్ణ అనగా.. నువ్వు ఊరుకో అమ్మా, అక్కడ టీవీలో చూపిస్తుంది నా బిడ్డను, ఆ బాధేంటో నాకు తెల్సని చెబుతుంది. ఆపై ఏడుస్తూ రాజు వద్దకు వెళ్లి "ఏమయ్యా రాజు.. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా, ఇప్పుడు సంతోషంగా ఉందా, ఇప్పుడు నీ కడుపుమంట చల్లబడిందా. నా కూతురు చూడు. ఇప్పుడొక చెప్పుకోరాని కేసులో ఇరుక్కుపోయింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి, నా అల్లుడు మదన్ పరిస్థితి ఏంటి" అంటుంది. అందుకు రాజు నేనేం చేశానని అడుగుతాడు. నువ్వు నన్ను అంటావేంటని ప్రశ్నిస్తాడు. చెయ్యాల్సిందంతా చేసి, ఏం చేశానంటావేంటయ్యా, నీ వల్ల కాదా వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని భ్రమరం అంటుంది. వెంటనే రేఖ కూడా అందుకుని.. ముమ్మాటికీ వీళ్ల వల్లే అని చెబుతుంది. "ఆరోజు అసలు ఫంక్షన్ పెట్టి, లక్కీని నా కొడుకుగా అనౌన్స్ చేస్తున్న విషయం మదన్‌కు తెలియను కూడా తెలియదు. కానీ మీరే కావాలని వెళ్లి వాడిలో ద్వేషం పెంచారు. వాడిని ఫంక్షన్‌కు వచ్చేలా చేసి మొత్తం గొడవ జరిగేలా మీరే ప్లాన్ చేశారు. చివరకు వాడిని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశారు. చెప్పండి దీనంతటికీ మూల కారణం మీరు కాదా" అంటూ రేఖ నిలదీస్తుంది. దీంతో ఇందు.. ఆంటీ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు.. ముందు వాళ్లిద్దరినీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకురావాలని చెబుతుంది. కానీ రేఖ మాత్రం.. "ఏంటి నువ్వు తీసుకు వచ్చేది. ఆల్రెడీ మీరు చేసిన ఘనకార్యాలు చాలు. వాడిని కన్నతల్లికి దూరం చేశారు, ఇంటి నుంచి దూరం చేశారు. అయిన వాళ్ల నుంచి దూరం చేశారు. ఇంకా మీరు చేసింది చాలు. వాళ్లను ఎలా బయటకు తీసుకురావాలో మాకు తెలుసు. మీరేం లేనిపోని ప్రమలు ఒలకబోయాల్సిన అవసరం లేదు" అంటుంది. దీంతో అపర్ణ.. ఏంటి రేఖా, నువ్వలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇందు మాట్లాడిన దాంట్లో తప్పేముందని అడుగుతుంది. అయినా ఇప్పుడు మీరు వెళ్లడం కంటే ఇందు, రాజు వెళ్లడమే మంచిదని చెబుతుంది. ఎందుకు వాళ్ల మీద ఇంకోనాలుగైదు కల్పించి ఈ కేసులో స్ట్రాంగ్‌గా ఇరికించడానికి అని అడుగుతుంది రేఖ. రేఖ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూనే.. మదన్‌కు ఇప్పుడు మీ మీద కోపం ఉంది, వాడు మీ మాట అస్సలే వినడని అపర్ణ వివరిస్తుంది. అందుకే ఇందు, రాజు వెళ్లడమే కరెక్ట్ అంటున్నానని చెబుతుంది. మరోవ