
మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్ధుడు తప్పిపోగా.. ఆయన్ను బిహార్ నుంచి పంజాబ్లోని స్వస్థలానికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ యువకుడు.
ఇంటర్నెట్‌ డెస్క్: మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్ధుడు తప్పిపోగా.. ఆయన్ను బిహార్‌ నుంచి పంజాబ్‌లోని స్వస్థలానికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నాడో యువకుడు. పంజాబ్‌ లుధియానాలోని ఫతేగఢ్‌ గుజ్రన్‌ గ్రామానికి చెందిన చమన్‌లాల్‌ అనే వృద్ధుడు ఈ నెల 11న అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ సందర్శనకు వెళ్లి తప్పిపోయారు. ఈ క్రమంలోనే బిహార్‌ వెళ్లే రైలు ఎక్కి.. గయలో దిగారు. అక్కడే తచ్చాడుతుండగా.. అక్కడే ఉన్న నీరజ్‌ ఆయన పరిస్థితిని గమనించారు. ఎలాగైనా అతడని ఇంటికి చేర్చాలని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల పాటు తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చారు. తప్పిపోయిన వృద్ధుడు ఊరి పేరు మాత్రమే చెప్పడంతో.. ఇంటర్నెట్‌ సాయంతో ఆ గ్రామాన్ని గుర్తించి పంజాబ్‌కు బయల్దేరారు. మరోవైపు, లాల్ కుటుంబీకులు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ చేరుకున్న నీరజ్.. అక్కడి స్థానికుడిని ఫతేగఢ్ గుజ్రన్ వివరాలు ఆరా తీశారు. అప్పటికే లాల్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చూసిన ఆ వ్యక్తి.. ఆయన్ను గుర్తుపట్టారు. వృద్ధుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా.. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. లాల్‌ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో వారు ఎంతో సంతోషించారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారని వృద్ధుడి మనవడు సుఖ్‌చైన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వినాయక నవరాత్రుల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా గణేశ్‌ నవరాత్రి (Ganesh Navratri) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న వేళ.. గుజరాత్‌లో రెండు రోబోలు (Robots) స్వామి సేవలో పాల్గొన్నాయి.




