
Ganesh Festival | మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ముల్కల్లలో శివగణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో 33వ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ముల్కల్ల ( Mulkalla ) లో శివగణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో 33వ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు ( Ganapati Celebrations ) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. భక్త మండలి సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఉత్సవాల ప్రారంభంతో ముల్కల్లలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భక్త మండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.





