
IPL 2027: ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగింపుపై బీసీసీఐ మరోసారి పునరాలోచిస్తోంది. 2027 వరకు ఈ నిబంధనను కొనసాగించాలని గతంలో నిర్ణయించినప్పటికీ, పది ఫ్రాంచైజీల నుంచి భిన్నమైన అభిప్రాయాలు రావడంతో తుది నిర్ణయంపై చర్చ జరుగుతోంది. వచ్చే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రూల్ రద్దయిందని చెప్పలేమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
IPL 2027: భారత అత్యున్నత క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL)లో గత కొన్ని సీజన్లుగా మ్యాచ్‌లకు మరింత ఉత్కంఠను తీసుకొచ్చే ఇంపాక్ట్ ప్లేయర్(Impact Player) రూల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2027 టోర్నమెంట్‌కు ముందు ఈ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మరోసారి తీవ్రంగా పునరాలోచిస్తోంది. ఆటలోని అసలు మజాను, ఆల్‌రౌండర్ల ప్రాధాన్యతను కాపాడే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయంపై దృష్టి సారించింది.





