
IPL 2027: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు ఎండ్ కార్డ్ పడుతుందా? .. బీసీసీఐ నిర్ణయంపైనే అందరి కళ్లు!
IPL 2027: ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగింపుపై బీసీసీఐ మరోసారి పునరాలోచిస్తోంది. 2027 వరకు ఈ నిబంధనను కొనసాగించాలని గతంలో నిర్ణయించినప్పటికీ, పది ఫ్రాంచైజీల నుంచి భిన్నమైన అభిప్రాయాలు రావడంతో తుది నిర్ణయంపై చర్చ జరుగుతోంది. వచ్చే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రూల్ రద్దయిందని చెప్పలేమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.















