
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
మేష రాశివారికి సెప్టెంబర్ నెలలో కొత్త ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఇక, కెరీర్, ఉద్యోగం పరంగానూ ఈ నెలలో బాగా కలిసిరానుంది. ఉద్యోగం మారాలి అనుకునేవారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆఫీసులో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జీతం పెరుగుతుంది.
వ్యాపారులు, ముఖ్యంగా రిటైల్ వ్యాపారులు గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందుతారు. పొదుపు పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి, ఇది మీ వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.
ఈ సెప్టెంబర్ 5 తర్వాత.. కుంభ రాశివారికి అప్పుల బాధలు తీరుతాయి. అనుకోని ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెంచుకోవడానికి రకరకాల మార్గాలు సుగమమవుతాయి. పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వచ్చి, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ సజావుగా సాగుతాయి. కొత్త ఉద్యోగ బాధ్యతలతో పాటు ప్రయాణాలు కలసి వస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
ఈ నెలలో ధనస్సు రాశివారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. కెరీర్ లో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. పాత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఈ సెప్టెంబర్ నెలలో సింహ రాశివారికి పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది.. కోరికలు నెరవేరుతాయి. సంపద వేగంగా పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున లాభాలు పొందుతారు. మీరు వేసే ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసి విజయపథంలో దూసుకుపోతారు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. వైవాహిక జీవితం ఆనందం, శాంతితో సాగిపోతుంది.
ఈ నెలలో కర్కాటక రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసి బాస్‌ల నుండి ప్రశంసలు, గౌరవం పొందుతారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ నాయకత్వ నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Asianet News Telugu లో చూడండి








