‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1984–85 బ్యాక్డ్రాప్లో గుర్తింపు లేని ‘సవారీలు’ తెగ ఆత్మగౌరవ పోరాటాన్ని ఇందులో అత్యంత వాస్తవికంగా చూపించనున్నారు. ఈ సినిమా కోసం రోప్స్, జడల వల్ల గాయాలైనా డూప్ లేకుండా రియల్ స్టంట్స్ చేశానని నాని తెలిపారు. సీనియర్ నటుడు మోహన్ బాబు మునుపెన్నడూ చూడని క్రూరమైన విలన్ పాత్రలో కనిపిస్తారని చెప్పారు. అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాని–సోనాలి కులకర్ణిల మధ్య నడిచే బలమైన ‘అమ్మ-కొడుకు’ ఎమోషన్ చిత్రానికి ప్రాణమని, థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా ఆ అనుభూతి ప్రేక్షకులను వెంటాడుతుందని నాని స్పష్టం చేశారు.





