సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. పడవ పోటీల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. రజనీ స్వయంగా ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారని, ఆయన మాటలు తమకు లభించిన గొప్ప వరమని నటుడు సూరి సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
T





