Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:
Movie Profile
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లో మాలీవుడ్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ తన పాత్ర చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సాధారణంగా జక్కన్న ప్రాజెక్ట్ కమిట్ అయిన నటులు వేరే చిత్రాల్లో నటించడం అరుదు. అయితే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ మొదలైనప్పటి నుంచి తన షూట్ పూర్తయ్యేలోపు పృథ్విరాజ్ ఏకంగా నటుడిగా, దర్శకుడిగా 9 ప్రాజెక్టులను ముగించి సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం మూడు వారాల ప్యాచ్ వర్క్ ముగిస్తే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ విజువల్ వండర్ మొదటి భాగం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Samayam Telugu లో చూడండి







