
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా క్యాన్సర్‌ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు(Guntur) సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.2.5 కోట్లతో ప్రత్యేక జన్యుపరీక్షల ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన పరికరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. తొలిదశలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులకు పరీక్షలు నిర్వహించనున్నారు. క్యాన్సర్‌ రోగుల నుంచి సేకరించిన నమూనాలను ప్రత్యేకంగా పరీక్షించి కణాల్లోని జన్యు మార్పులను గుర్తిస్తారు. వాటి ఆధారంగా రోగికి ఏ చికిత్స అవసరమో వైద్యులు నిర్ణయించేందుకు వీలవుతుంది. రోగ నిర్ధరణ నుంచి చికిత్స, తదుపరి పర్యవేక్షణ వరకు ఈ విధానాన్ని ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా సంస్థ, స్ట్రాండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థల భాగస్వామ్యంతో చేపడుతున్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రయోగశాలను ఈ నెల 22న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం సూక్ష్మస్థాయి జన్యు మార్పు పరీక్షల కోసం కొందరు రోగుల నమూనాలను బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు పంపించాల్సి వస్తోందని, ఈ ఇబ్బందిని తొలగించి రాష్ట్రంలోనే అధునాతన పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యమని మంత్రి తెలిపారు. జన్యు పరీక్షలను రోగులకు ఉచితంగా అందించనున్నామని, బయట ప్రైవేటు కేంద్రాల్లో ఒక్కో పరీక్షకు రూ.20 వేల నుంచి 25 వేల వరకు, పూర్తి స్థాయి పరీక్షలకు రూ.75 వేల వరకు ఖర్చవుతున్న నేపథ్యంలో ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ప్రముఖ నటుడు సోనూ సూద్‌ (Sonusood) పేరుతో విజయవాడలో ఓ అభిమాని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. అంబేడ్కర్ కోనసీమ(Ambedkarkonaseema) జిల్లా కేంద్రం అమలాపురం సహా పలు ప్రాంతాల్లో కుండ పోత వర్షం కురిసింది. తిరుమల (Tirumala) శ్రీవారిని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సతీమణి వసుంధర దర్శించుకున్నారు. తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామి వారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.





