హరారే వేదికగా జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 1 వికెట్ తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి 3-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (81*), ఎర్విన్ (59) రాణించడంతో 271/8 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 272 పరుగుల లక్ష్య ఛేదనలో జోష్ ఇంగ్లిస్ (103) సెంచరీ, నాథన్ ఎల్లిస్ (36*) పోరాటంతో ఆసీస్ 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
T