
బుల్లితెరపై అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మొదలైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషలలోనూ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ టాస్కులో కంటెస్టెంట్స్ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో సైతం ఈ షో ప్రారంభమైంది. సాధారణంగా బిగ్ బాస్ షోలో టాస్కులలో కంటెస్టెంట్స్ పోటీపడడం కామన్. కొన్ని సందర్భాల్లో ఆట శ్రుతి మించినప్పటికీ ఎలాంటి గాయాలు తగలకుండా ఆడాలని హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ తాజాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 10లో ఓ టాస్కులో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. గత సీజన్లలో రాత్రిపూట కంటెస్టెంట్లు నిద్రపోవడం లేదా మాట్లాడుకోవడం మాత్రమే చూపించేవారు. అటువంటి వాతావరణంలో, రాత్రిపూట చూసే ప్రేక్షకులకు కూడా కంటెంట్ అందించాలనే ఉద్దేశ్యంతో, ఈ 10వ సీజన్లో ‘నైట్ టాస్క్’ అనే దానిని ప్రవేశపెట్టాలని టీమ్ నిర్ణయించింది. ఆ టాస్క్‌లో పాల్గొనే కంటెస్టెంట్లకు, రాత్రంతా నిద్రపోకుండా వినోదాత్మకంగా ఏదైనా చేయమని సూచించారు.




