
EPF wage ceiling: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్యనిధి (EPF) గరిష్ఠ వేతన పరిమితిని పెంచేందుకు ఆమోదం తెలిపింది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

EPF wage ceiling: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్యనిధి (EPF) గరిష్ఠ వేతన పరిమితిని పెంచేందుకు ఆమోదం తెలిపింది.
EPF wage ceiling | ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్యనిధి (EPF) గరిష్ఠ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ.15వేలుగా ఉన్న పరిమితిని రూ.25వేలకు పెంచేందుకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. ఈపీఎఫ్‌ వేతన పరిమితి పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. జీవన వ్యయం పెరిగినప్పటికీ దాదాపు 12 ఏళ్లుగా గరిష్ఠ వేతన పరిమితి పెరగలేదు. 2014లో చివరిసారిగా రూ.6500 నుంచి రూ.15వేలకు పెంచారు. దీంతో వేతన పరిమితి పెంచాలని కొన్నేళ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల అదనంగా 51 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని, వీరంతా ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి వస్తారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. దీనిపై కేంద్రం ఏటా రూ.11,339 కోట్లు వెచ్చించనుందని చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి