
నగరంలోని ఓ రైతుబజారులో విక్రయాలు న్యూస్‌టుడే, దేవీచౌక్‌: ఉల్లి ధరలు సామాన్యులకు భారంగా మారాయి. నిత్యవసర వస్తువులతో పోటీపడి ఆకాశాన్నంటుతున్నాయి. మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడంతో పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో రైతుబజార్లలో కేజీ రూ.31 ఉన్న ధర ప్రస్తుతం రూ.48కు చేరింది. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.80 పలుకుతున్నాయి. ఆగస్టు 10 నుంచి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ధరలు పెరగడంతో రైతుబజార్లలో అమ్మకాలు కూడా తగ్గాయి. వినియోగదారులు తమ కొనుగోలును సగానికి తగ్గించేశారు. ధర తక్కువగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరం టోకు మార్కెట్‌కు రోజుకు 10 నుంచి 15 లారీలు వచ్చేవి. ప్రస్తుతం ధర పెరగడం, దిగుమతులు లేకపోవడంతో వాటిలో సగం మాత్రమే వస్తున్నాయి. కొత్తపంట వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని టోకు వర్తకులు పేర్కొంటున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.