తెలంగాణలో సెప్టెంబరు 19 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 20, 21 తేదీల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ 18 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. 621 మండలాల్లో 323 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కాగా.. ఈ సీజన్లో 19 శాతం లోటు ఉండటంతో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. లక్ష్యంతో పోలిస్తే వరి సాగు 10.58 లక్షల ఎకరాలు తగ్గింది.





