
India vw West Indies ODI Squad Announcement Live Updates: వెస్టిండీస్‌తో జరగబోయే వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టును నేడు ప్రకటించే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 6న ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీ20ఐ జట్టు, రాబోయే ఆసియా క్రీడల కోసం ప్రకటించిన జట్టును పోలి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఒకేసారి రెండు సిరీస్ లు ఆడనుండడంతో అందుబాటులో ఉన్న ఎంపికల నుంచి వన్డే జట్టును ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి మరింత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు.





