
konda surekha | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే షోకాల్డ్ నాయకుడు కడియం శ్రీహరి నెల, రెండు నెలలు కూడా ఆగకుండా అక్కడ ఆ జెండాతో గెలిచి ఇక్కడికొచ్చిండని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

konda surekha | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే షోకాల్డ్ నాయకుడు కడియం శ్రీహరి నెల, రెండు నెలలు కూడా ఆగకుండా అక్కడ ఆ జెండాతో గెలిచి ఇక్కడికొచ్చిండని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు.
Konda Surekha | వరంగల్ పార్టీ ముఖ్యనేతలతో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సమావేశమయ్యారు. అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ పలువురు నేతలపై చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పుడు మాట్లాడుతున్న షోకాల్డ్ నాయకులంతా ఇక్కడే పుట్టి, పెరిగి ఇక్కడే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను వరంగల్లో గెలవగానే కొన్ని రోజులకు ఆ షోకాల్డ్ నాయకుడు (కడియం శ్రీహరి) నా వెనుకాలే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీలోకి వచ్చిండు. అక్కడ ఎమ్మెల్సీ తీసుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల, రెండు నెలలు కూడా ఆగకుండా అక్కడ ఆ జెండాతో గెలిచి ఇక్కడికొచ్చిండని చెప్పారు.
ఇప్పుడున్న కొంతమంది నిన్న మొన్న పదవి వచ్చినవాళ్లు కూడా ఆ రోజు గుండు సుధారాణి మీద అసమ్మతి పెట్టే ఆలోచన ఉంటే.. అన్న కొండామురళి దగ్గరకు వచ్చి అసమ్మతి పెట్టొద్దు సహకరించాలని ఆమె (గుండు సుధారాణి) దండం పెడితే ఆ రోజు అసమ్మతి పెట్టకుండా ఆపాడు. లేకపోతే ఆ రోజే ఆమె పదవి పోయి ఉండేది. మళ్లీ వచ్చి అన్నకేదో మంచి మాటలు చెప్పి కుడా చైర్మన్ వస్తే వస్తది లేకపోతే లేదు అన్న రాసి ఇయ్యు అని అడిగితే ఉదార స్వభావంతో కొండా మురళి రాసిచ్చాడు. ఈ రోజు పదవి వచ్చినంక ఆమె మనకు ఫోన్ కూడా చేయలేదన్నారు.
కడియం శ్రీహరి 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీలోకి పోయి ఎమ్మెల్సీ తీసుకున్నాడు
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల రోజులు కూడా ఆగకుండా ఇటు జంప్ అయ్యాడు
గుండు సుధారాణి మీద ఆ రోజుల్లో అసమ్మతి పెడదామని అనుకుంటే, ఆమె వచ్చి కొండా మురళికి దండం పెడితే వదిలేసాం… https://t.co/z2P28vlrfr pic.twitter.com/Lt74KeLdav
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026
Indonesia | 240 మందితో వెళ్తున్న పడవ ఇండోనేషియా తీరంలో గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Low-voltage | నిజాంపేటలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతుల ఆందోళన
Grade-1 Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి..?
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Namasthe Telangana లో చూడండి