
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకొని, స్మగ్లర్లను పట్టుకున్న అటవీశాఖ సిబ్బందిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకొని, స్మగ్లర్లను పట్టుకున్న అటవీశాఖ సిబ్బందిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు.
అన్నమయ్య: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకొని, స్మగ్లర్లను పట్టుకున్న అటవీశాఖ సిబ్బందిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అభినందించారు. స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో వారు గాయపడటం బాధాకరమన్నారు. అన్నమయ్య జిల్లా రొంపిచర్ల మండలం బొమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ అరణ్య’లో భాగంగా విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బంది వాహనాన్ని శనివారం రాత్రి దుండగులు ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె.ప్రకాశ్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పి.రెడ్డి ప్రసాద్, కె.ప్రతాప్‌, డ్రైవర్ చరణ్ గాయపడినట్లు తెలుసుకున్న పవన్‌.. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, చికిత్సకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, సిబ్బంది పూర్తి స్థాయిలో కోలుకునే వరకు అటవీ ముఖ్య సంరక్షణాధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. అటవీ సంపదను దోచుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరుస సెలవుల నేపథ్యంలో మార్కాపురం (Markapuram) జిల్లా దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (Veligonda project)కు సందర్శకుల తాకిడి పెరిగింది. అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. వినాయక చవితి (Ganesh Chaturthi) వేళ తూర్పుగోదావరి జిల్లా కడియంలోని మురుగన్‌ నర్సరీలో వినూత్నంగా వృక్ష గణపతిని తయారు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Rains) తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు బస్టాండ్ జలమయమైంది.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి