
RBI Repo Rate Hike : ఆర్బీఐ రెపో రేటు పెరిగే ఛాన్స్ ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. చమురు ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో రెపో రేటు పెరిగితే హోమ్ లోన్ సహా ఫ్లోటింగ్ రేట్ రుణాల ఈఎంఐలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

RBI Repo Rate Hike : ఆర్బీఐ రెపో రేటు పెరిగే ఛాన్స్ ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. చమురు ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో రెపో రేటు పెరిగితే హోమ్ లోన్ సహా ఫ్లోటింగ్ రేట్ రుణాల ఈఎంఐలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

RBI Repo Rate Hike : లోన్లు తీసుకున్నారా? హోం లోన్లు ఇతర ఏదైనా లోన్ రుణం తీసుకున్నారా? ఆర్బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటివరకూ ప్రతిసారి మానిటరింగ్ పాలసీ సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచుతూ వచ్చింది. ఈసారి అలా ఉండకోవచ్చు.. నివేదికల ప్రకారం.. ఆర్బీఐ రెపో రేటును పెంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే రుణాలు తీసుకున్న వారికి మరోసారి ఈఎంఐ భారం పెరగనుంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి. పలువురు ఆర్థికవేత్తలు డిసెంబర్ నాటికి రేటు పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారితే అక్టోబర్ పాలసీ సమీక్షలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. డిసెంబర్ నాటికి రెపో రేటు పెరగొచ్చు :
తొమ్మిది మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ చీఫ్‌లతో నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది డిసెంబర్ నాటికి రెపో రేటు పెరగవచ్చని అంచనా వేశారు. మొదట 25 బేసిస్ పాయింట్ల పెంపు, ఆ తర్వాత 2027 ఫిబ్రవరిలో మరో 25 బేసిస్ పాయింట్ల పెంపు ఉండొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ రెండు పెంపులు జరిగితే.. రెపో రేటు 5.75 శాతానికి చేరే ఛాన్స్ ఉంటుంది.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి






