

Shalini Patel : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది.
ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన జబర్దస్త్ ఫేమ్ కమెడియన్, రచయిత ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ ని అగ్నిపరీక్ష లో ఫైనల్ అయిన వాళ్లలో ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేయమని నవదీప్ కి ఛాన్స్ ఇచ్చారు. నవదీప్ షాలిని పటేల్ ని సెలెక్ట్ చేసారు. ఆస్ట్రేలియాలో ఉండే తెలుగమ్మాయి షాలిని పటేల్. సోషల్ మీడియాలో రీల్స్ తో ఫేమ్ తెచ్చుకుంది. అగ్నిపరీక్ష ద్వారా షాలిని పటేల్ బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ లోకి ఎంట్రీ అయింది. నవదీప్ ఫైనల్ చేయడంతో షాలిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Also Read : Jabardasth Ram Prasad : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన ఏడవ కంటెస్టెంట్.. జబర్దస్త్ వదిలేసి వచ్చిన కమెడియన్..
Telugu.Digital EditorialSenior Editorial Lead Telugu.Digital వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి
సంబంధిత కథనాలు (Related Stories)








