
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:


Temper Vamsi : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది.
ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష లో షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇచ్చారు.
Also Read : Shalini Patel : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన ఎనిమిదవ కంటెస్టెంట్.. ఫైనల్ చేసిన నవదీప్..
టెంపర్ వంశీ నరసాపురం నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ తో, చిరంజీవి మీద ఇష్టంతో సినీ పరిశ్రమకి వచ్చాడు. ఛాన్సుల కోసం తిరుగుతూ జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి అనంతరం విలన్ గా నటించాడు. టెంపర్ వంశీ గా ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వంశీ ఇన్నాళ్లు నెగిటివ్ పాత్రలు చేశాను. దాన్ని బ్రేక్ చేస్తాను. నా రియల్ క్యారెక్టర్ చూపిస్తాను అన్నారు.
Telugu.Digital EditorialSenior Editorial Lead Telugu.Digital వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి
Tcheckసంబంధిత కథనాలు (Related Stories)
ఏపీ హైకోర్టులో ఐదుగురు జడ్జిలకు శాశ్వత హోదా.. కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఓకేAndhra Jyothy23 Sept
ఈనెల 30 లోపు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవిsuryaa andhrapradesh23 Sept
ఈనెల 25న క్యూర్ పరిధిలో సెలవుEenadu23 Sept

ఈనెల 25న క్యూర్ పరిధిలో సెలవుEenadu23 Sept