
కేంద్రానికి చెందిన మేటి సంస్థల్లో సేవలందించే అవకాశమొచ్చింది. దేశ వ్యాప్తంగా 1748 జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన వెలువడింది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

కేంద్రానికి చెందిన మేటి సంస్థల్లో సేవలందించే అవకాశమొచ్చింది. దేశ వ్యాప్తంగా 1748 జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన వెలువడింది.
కేంద్రానికి చెందిన మేటి సంస్థల్లో సేవలందించే అవకాశమొచ్చింది. దేశ వ్యాప్తంగా 1748 జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన వెలువడింది. డిప్లొమా లేదా బీటెక్‌తో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల్లో ప్రతిభతో జేఈ కొలువులో చేరిపోవచ్చు. ఎంపికైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.70 వేల వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికీ చేరుకోవచ్చు. డి ప్లొమా విద్యార్హతతో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జూనియర్‌ ఇంజినీర్లు అధిక ప్రాధాన్యం ఉన్న పోస్టులు. వీటికి ఎంపికైనవారు లెవెల్‌-6 వేతన శ్రేణి ప్రకారం జీతం పొందుతారు. విధుల్లో చేరిన తర్వాత అనుభవం, నైపుణ్యాలు, విద్యార్హతలతో.. అసిస్టెంట్‌ ఇంజినీర్, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్, అసిస్టెంట్‌ డివిజినల్‌ ఇంజినీర్, డివిజినల్‌ ఇంజినీర్‌ స్థాయికీ చేరుకోగలరు. ఈ పోస్టులకు రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. రెండు గంటల వ్యవధితో 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 50, జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు అడుగుతారు. దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం సంబంధిత విభాగం నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో కనీస అర్హత మార్కులు సాధించి, మెరిట్‌లో నిలిచినవారికే పేపర్‌-2కి అవకాశమిస్తారు. ఈ పరీక్షను 300 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఈ ప్రశ్నలన్నీ దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం సంబంధిత విభాగాల నుంచే వస్తాయి. రెండు పేపర్లూ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. పేపర్‌-1లో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు, పేపర్‌-2లో ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పేపర్‌-1, పేపర్‌-2ల్లో అర్హత కోసం యూఆర్‌ 30, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ 25, మిగతా విభాగాల వారు 20 శాతం మార్కులు పొందాలి. పేపర్‌-2 అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి, ఎలాంటి ఇబ్బందీ లేనివారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లోని పోస్టులకు మాత్రం ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్షలు అదనం. పోస్టులు: 1748. అర్హత: సంబంధిత/ అనుబంధ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా లేదా బీఈ/ బీటెక్‌. డిప్లొమా విద్యార్హతతో దరఖాస్తు చేసుకునే కొన్ని విభాగాల పోస్టులకు అనుభవం అవసరం. ఇండియన్‌ మీటీయొరాలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌లో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బీఎస్సీలో ఫిజిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ నేపథ్యంతోనూ పోటీ పడవచ్చు. వయసు: ఆగస్టు 1, 2026 నాటికి 30 ఏళ్లు మించరాదు. కొన్ని విభాగాల్లోని పోస్టులకు 32 ఏళ్ల వరకు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. పరీక్ష ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 22 పరీక్ష తేదీలు: పేపర్‌-1 అక్టోబరు/ నవంబరులో, పేపర్‌-2 డిసెంబరులో నిర్వహిస్తారు. వెబ్‌సైట్‌: https://ssc.gov.in/login ‘‘పరీక్షలో విజయానికి ఎన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించారు అనే దాని కంటే ఎన్ని సరైన జవాబులు ఇచ్చారో కీలకం. విజయాన్ని దూరం చేసే వాటిలో రుణాత్మక మార్కుల పాత్ర ఎక్కువే. అందుకే ఇవి లేకుండా చూసుకోవాలి లేదా చాలా పరిమితంగా ఉండాలి’’ ‘‘తక్కువ వ్యవధిలో ఎక్కువ జవాబులు గుర్తించడానికి వేగం, కచ్చితత్వం ముఖ్యమైన అస్త్రాలు. విస్తృత అధ్యయనం, గరిష్ఠ సంఖ్యలో మాదిరి ప్రశ్నల సాధన ద్వారా ఈ రెండింటిపైనా పట్టు లభిస్తుంది’’ .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి







