
ఉదయం లేవగానే వేడి వేడి టీనో, కాఫీనో తాగనిదే ఏ పనీ మొదలుపెట్టరు చాలామంది ఆడవాళ్లు. అంతలా అది మన జీవితంలో భాగమైంది మరి. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అయితే, దాన్ని ఎంత ఉష్ణోగ్రతలో తాగుతున్నారన్నదీ ముఖ్యమే. ఉ దయం లేవగానే వేడి వేడి టీనో, కాఫీనో తాగనిదే ఏ పనీ మొదలుపెట్టరు చాలామంది ఆడవాళ్లు. అంతలా అది మన జీవితంలో భాగమైంది మరి. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అయితే, దాన్ని ఎంత ఉష్ణోగ్రతలో తాగుతున్నారన్నదీ ముఖ్యమే. వాతావరణం చల్లగా ఉందనో, నిద్ర పోగొట్టుకోవాలనో వేడిగా ఉండే టీ, కాఫీలు తాగడం అలవాటు కొందరికి. కానీ, బాగా వేడిగా ఉన్నవి అంటే... 65 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా ఎక్కువ వేడిగా ఉన్నవి తాగితే ‘స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా’ అనే ఆహార నాళ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికోసం పరిశోధకులు మిలియన్‌ ఉమన్‌ స్టడీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ బయోబ్యాంక్‌ల డేటాను తీసుకొని విశ్లేషించారు. మరీ అంత వేడిగా తాగని వాళ్లతో పోలిస్తే వీళ్లలో ఈ ప్రమాదం మూడు రెట్లు అధికమట. కాబట్టి, ఏదైనా వేడిగా తాగేముందు కొద్ది నిమిషాలు వేచి ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings