
మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్.. ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్.. ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి ప్రశ్న మదనాపురం సభలో ప్రసంగిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. వేదికపై మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తదితరులు మదనాపురం, కొత్తకోట, చిన్నచింతకుంట, న్యూస్‌టుడే: మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్‌.. ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం వనపర్తి జిల్లా మదనాపురంలో నిర్వహించిన సభలో వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కరివెన వద్ద కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పి.. కమీషన్ల కోసం కాళేశ్వరం వెంట పరిగెత్తారని ఆరోపించారు. ప్రజల మధ్య ఉండి వారి కోసం పనిచేసి తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కేటీఆర్‌ మాత్రం తన తండ్రి కేసీఆర్‌ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జూరాల నీటిని పొదుపుగా వాడుకోవాలి ఎ ల్‌నినో ప్రభావంతో కరవు వచ్చిందని, జూరాల ప్రాజెక్టు రైతులు ఆందోళన చెందొద్దని, సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. తాగునీటి అవసరాల దృష్ట్యా నీటి నిల్వలు అందుబాటులో ఉంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి ఆలయం వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. గత భారాస ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడా నాయకులు రైతుల కోసం మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి