
కేంద్రానికి చెందిన మేటి సంస్థల్లో సేవలందించే అవకాశమొచ్చింది. దేశవ్యాప్తంగా 1748 జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన వెలువడింది. డిప్లొమా లేదా బీటెక్‌తో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల్లో ప్రతిభతో జేఈ కొలువులో చేరిపోవచ్చు. ఎంపికైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.70 వేల వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఈ పోస్టులకు రెండు దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. వివరాలకు..




