
జిల్లా కేంద్రం చిత్తూరు గ్రామీణ మండలంలో గ్రానైట్ను కొల్లగొడుతున్నారు. రోజూ రూ.లక్షల విలువైన ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్ను నియంత్రించాల్సిన రెవెన్యూ, మైనింగ్ శాఖలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

జిల్లా కేంద్రం చిత్తూరు గ్రామీణ మండలంలో గ్రానైట్ను కొల్లగొడుతున్నారు. రోజూ రూ.లక్షల విలువైన ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్ను నియంత్రించాల్సిన రెవెన్యూ, మైనింగ్ శాఖలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి.
అక్రమ మైనింగ్‌లో అండదండలు చెన్నసముద్రంలో కొండ వద్ద మైనింగ్‌ చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం చిత్తూరు గ్రామీణ మండలంలో గ్రానైట్‌ను కొల్లగొడుతున్నారు. రోజూ రూ.లక్షల విలువైన ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను నియంత్రించాల్సిన రెవెన్యూ, మైనింగ్‌ శాఖలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. ఈ మైనింగ్‌ వెనుక ముఖ్య ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిత్తూరు మండలం నాయనిచెరువు పంచాయతీ చెన్నసముద్రంలో ఐదు నెలలుగా గ్రానైట్‌ క్వారీలో మైనింగ్‌ గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. అంతకుముందు చిత్తూరు సమీపంలోని నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో ఓ వ్యక్తి ఏడాదిన్నర పాటు తవ్వకాలు చేపట్టారు. కానీ ఇక్కడ లావాదేవీలు బెడిసికొట్టడంతో పనులు ఆపేశారు. ఈ క్వారీపై ప్రజాప్రతినిధి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న పీఏ కన్నుపడింది. ఆయన గ్రానైట్‌ వ్యాపారులతో చేతులు కలిపి కొన్ని నెలలుగా మళ్లీ అక్రమ మైనింగ్‌ చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అధికారుల తనిఖీలతో ఒకటి, రెండు రోజులు తవ్వకాలు ఆపేసి యథావిధిగా మళ్లీ కొనసాగిస్తున్నారు. చిత్తూరు నగరం, గ్రామీణ మండలంలో దాదాపుగా 33 క్వారీలు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని అక్రమంగా సాగుతున్నాయి. ఈ క్వారీ నిర్వాహకుల నుంచి నెల వారీ వాటా కింద ఆ పీఏకు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. లేకపోతే పనులు ఆపేయాల్సి వస్తుందని నిర్వాహకులు భయపడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు రూ.కోట్ల వేటలో పడ్డారా పీఏ. ఈ వ్యవహారం అంతా ప్రజాప్రతినిధికి తెలిసే జరుగుతుందా.. తెలియకుండా జరుగుతుందా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి








