
Upadi Hami Works | ఇటీవల అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ శశికాంత్ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాలేదని, దీనిపై విచారణ జరిపించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Upadi Hami Works | ఇటీవల అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ శశికాంత్ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాలేదని, దీనిపై విచారణ జరిపించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
Upadi hami works | రాయపోల్, సెప్టెంబర్ 16 : ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగితే సహించే ప్రసక్తి లేదని సిద్దిపేట జిల్లా అడిషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇటీవల అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ శశికాంత్ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాలేదని, దీనిపై విచారణ జరిపించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారుల సూచనల మేరకు అడిషనల్ ఏపీడీ ఆనంద మేరీతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో విచారణ జరిపి వివరాలను పరిశీలించారు. సంబంధిత అధికారులు ఆయా గ్రామాల సర్పంచుల నుంచి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో జనార్ధన్, సర్పంచ్, సీనియర్ నాయకుడు ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ‘భక్తిశ్రద్ధలు, సోదరభావంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి’ TN CM Vijay | లండన్‌లో తమిళనాడు సీఎం విజయ్ ఈవెంట్ రద్దు.. అభిమానులకు నిరాశ..! Jobs Notification | ఏపీలో 2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Namasthe Telangana లో చూడండి





