
తెలుగురాష్ట్రాలకు వాతవరణ శాఖ చల్లని కబురు చెప్పింది. గత రెండ్రోజులుగా కొడుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ.. ఈ రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బంగాళాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది.