
పాఠశాలల్లో నిరుపయోగంగా కిట్లు చింతపర్రులో పెట్టెల్లోనే మరుగుదొడ్లు శుభ్రం చేసే రసాయనాలు పాలకొల్లు మండలం చింతపర్రు, యలమంచిలి మండలంలోని ఏ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో పరిశీలించినా పదికిపైగా బూజు కర్రలు, నాలుగైదు డస్ట్‌ బిన్నులు, లీటర్ల కొద్దీ కెమికల్‌ డబ్బాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లలో వినియోగించే రసాయనాలు సైతం పూర్తిగా వినియోగించని పరిస్థితి కొనసాగుతోంది. పాలకొల్లు, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పేరు చెప్పి ఏటా పంపిణీ చేస్తున్న కిట్లు రూపంలో రూ.కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. జిల్లా అంతటా ఒక గుత్తేదారుకు అప్పగించి 14 రకాల పరికరాలతో కూడిన కిట్లు అందిస్తుండగా.. వాటిలో 10 శాతం కూడా ఉపయోగపడటం లేదు. ఏ పాఠశాలకు వెళ్లి పరిశీలించినా.. పదుల సంఖ్యలో ఆయా పరికరాలు వృథాగా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల గత ప్రభుత్వంలో ఇచ్చిన టూల్స్‌ కూడా దర్శనమిస్తున్నాయి. ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులున్నారు.. అక్కడ ఏ మేర కిట్లు అవసరం ఉందనే ప్రతిపాదనలు లేకుండానే శానిటరీ కిట్లు పంపిణీ జరుగుతోంది. జిల్లాలో కొన్ని మూత పడిన పాఠశాలలకూ ఈ ఏడాది ఆయా కిట్లు మంజూరు చేశారు. యలమంచిలి మండలం నక్కాపాలెం ప్రాథమిక పాఠశాల దీనికి ఉదాహరణ. మిగిలిన చోట్ల విద్యార్థులు 80 మంది ఉన్నా.. ఎనిమిది మంది ఉన్నా.. దాదాపు ఒకే పరిమాణంలో రసాయనాలు, టూల్స్‌ అందించారు. పంపిణీ జరిగిన తీరు చూస్తే పాఠశాలల్లో అవసరాల కన్నా.. గుత్తేదారుల ప్రయోజనమే అధికంగా కనిపిస్తోంది. ఒక్కోటి రూ.వెయ్యి పలికే 60 లీటర్ల పరిమాణంలో ఉన్న చెత్త బుట్టలు ఒక్కోచోట నాలుగైదు నిరుపయోగంగా ఉన్నాయంటే నిధుల దుర్వినియోగం తెలుసుకోవచ్చు. కొన్నిచోట్ల ఆయా కిట్లు పక్కదారి పట్టిన ఉదంతాలు లేకపోలేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.