
వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి వర్సిటీలోనే పాతుకుపోయారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి వర్సిటీలోనే పాతుకుపోయారు.
ఉద్యాన వర్సిటీలో ఉద్యోగుల పాగా ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వెంకట్రామన్నగూడెంలోని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి వర్సిటీలోనే పాతుకుపోయారు. సహాయ ఆచార్యులుగా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టిన పలువురు అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగారు. ఉద్యోగోన్నతులు పొందినా కొంత మంది బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఏళ్ల తరబడి ఇక్కడే కొనసాగుతున్నారు. ఒ కే ప్రాంగణంలోని ఉద్యాన వర్సిటీ, కళాశాల, పరిశోధనా స్థానం, పంట కోత అనంతరం ఉత్పత్తి పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు. బోధనలో సహాయ ఆచార్యులు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఆచార్యులు ఉంటారు. వారు పరిశోధన విభాగంలోకి వెళ్తే శాస్త్రవేత్తలు, సీనియర్, ప్రధాన శాస్త్రవేత్తలుగా పిలుస్తారు. బదిలీ అయితే నిబంధనల ప్రకారం ఉద్యాన వర్సిటీ పరిధిలోని ఇతర జిల్లాల్లోని ఉద్యాన కళాశాలలు, కేవీకేలు, పరిశోధన స్థానాలకు పంపించాలి. కానీ వర్సిటీలో నిబంధనలకు పాతరేస్తున్నారు. ఉదాహరణకు స్థానిక ఉద్యాన కళాశాలలో కూరగాయల సైన్సు విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఒకరికి ప్రొఫెసర్‌గా బదిలీతో కూడిన ఉద్యోగోన్నతి లభించింది. కళాశాలలో ఫ్లోరికల్చర్‌ విభాగంలో ఆచార్యులుగా పని చేస్తున్న మరొకరికి స్థాన చలనం లభించింది. వారిని నిబంధనల ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ చేయాలి. కానీ స్థానిక పరిశోధన స్థానాల ప్రధాన శాస్త్రవేత్తలుగా నియమించారు. ఇలా చాలా మంది వెంకట్రామన్నగూడెం ప్రాంగణం గడప దాటి బయటకు వెళ్లట్లేదు. బోధనేతర ఉద్యోగులది సైతం ఇదే పరిస్థితి. స్థా నిక ఉద్యాన కళాశాలలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులున్నాయి. బోధన సిబ్బంది ఇటీవల కొందరు బదిలీ అయ్యారు. వారి స్థానాలు చాలా వరకు భర్తీ కాలేదు. పండ్లు, కూరగాయల సైన్సు, సుగంధ ద్రవ్యాలు, తోట పంటలు, ఫ్లోరికల్చర్, కీటక, తెగుళ్లు శాస్త్రం.. ఇలా మొత్తం ఏడు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి నలుగురు చొప్పున సహాయ ఆచార్యులు, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఒక ప్రొఫెసర్‌ ఉండాలి. వాటిలో చాలా చోట్ల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కొన్ని కోర్సులకు ఒప్పంద ప్రాతిపదికన తాత్కాలికంగా బోధించేందుకు కొంత మందిని నియమించారు. వారికి అనుభవం లేకపోవడంతో ఉద్యాన కళాశాలలో బోధన కుంటుపడుతోంది. గతేడాది ప్రవేశపెట్టిన ఫారెస్ట్రీ కోర్సుకు సైతం శాశ్వత బోధకులు లేకపోవడం గమనార్హం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి






